Asianet News TeluguAsianet News Telugu

2024 లోక్‌సభ ఎన్నికలు : మంత్రులకు టార్గెట్ పెట్టిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య

వచ్చే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన కేబినెట్ మంత్రులకు టార్గెట్ పెట్టారు. రాష్ట్రంలోని 28 లోక్‌సభ స్థానాల్లో కనీసం 20 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలవాలని సూచించారు. 
 

karnataka cm Siddaramaiah Gives Target To Ministers For 2024 Lok Sabha Polls ksp
Author
First Published May 28, 2023, 9:53 PM IST

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ముగిసి కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన సంగతి సంగతి తెలిసిందే. అయితే సీఎం సిద్ధరామయ్య తన మంత్రులకు కొత్త టార్గెట్ నిర్దేశించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 28 స్థానాల్లో కనీసం 20 స్థానాలను గెలవాలని సూచించారు. ఏడాదిలో లోక్‌సభ ఎన్నికలు రానున్నాయని పేర్కొన్న సిద్ధరామయ్య .. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు 20 సీట్లు గెలిచి కానుకగా ఇవ్వాలన్నారు. ఈ లక్ష్యాన్ని దృష్టిలో వుంచుకుని నిబద్ధత, నిజాయితీ, చురుకుదనంతో తమ బాధ్యతలు నిర్వర్తించాలని మంత్రులకు సూచించారు. ఇచ్చిన హామీలు ప్రజలకు చేరేలా చిత్తశుద్ధితో కృషి చేయాలని గతంలో జరిగిన పొరపాట్లు ఈసారి పునరావృతం కావొద్దన్నారు. త్వరలోనే శాఖల కేటాయింపు ప్రక్రియ పూర్తవుతుందని సీఎం మంత్రులకు తెలిపారు. 

ప్రజా సమస్యలు వినండి, స్పందించండి అంటూ సూచించారు. రాష్ట్ర ప్రజలు మనకు అపూర్వమైన మెజారిటీతో పాటు గొప్ప బాధ్యతను కూడా ఇచ్చారని.. దానికి అనుగుణంగా ప్రజానుకూలమైన పాలనను అందించడం మన విధి అని సిద్ధరామయ్య అన్నారు. స్థానికంగా సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని చిన్న చిన్న పనులకు కూడా విధానసౌధకు రాకుండా చూడాలని సీఎం సూచించారు. ప్రజలకు ఆమోదయోగ్యం పనిచేసి లోక్‌సభ ఎన్నికల్లో అపూర్వ విజయాన్ని నమోదు చేయాలన్నారు. కర్ణాటక ద్వారా కేంద్రంలోని దుష్ట పరిపాలనకు ముగింపు పలికే పరిస్ధితి వుందన్నారు. ఈ విషయం మరిచిపోకుండా మంత్రులు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించాలని సమస్యలు పరిష్కరించాలని పేర్కొన్నారు. 

ALso Read: కర్ణాటక మంత్రివర్గ విస్తరణ.. వ్యూహాత్మకంగా సిద్ధరామయ్య, కీలక శాఖలు తన వద్దే, డీకే చేతికి రెండే..?

ఇదిలావుండగా.. అనేక తర్జన భర్జనలు, సుదీర్ఘ కసరత్తు అనంతరం కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తన మంత్రివర్గాన్ని విస్తరించారు. ఇప్పటికే సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లతో పాటు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా.. శనివారం మరో 24 మంది ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన వారిలో ఆరుగురు లింగాయత్, నలుగురు వొక్కలిగ, ముగ్గురు ఎస్టీలు, ఆరుగురు ఎస్సీలు , ఇద్దరు ముస్లింలు, ఐదుగురు ఓబీసీ, ఒక బ్రాహ్మణ, ఒక మరాఠా, ఒక క్రిస్టియన్, ఒక జైన నేతకు ఛాన్స్ దక్కింది. పాత మైసూర్, కళ్యాణ కర్ణాటక ప్రాంతం నుంచి ఏడుగురికి, కిట్టూరు కర్ణాటక ప్రాంతం నుంచి ఆరుగురికి, సెంట్రల్ కర్ణాటక నుంచి ఇద్దరికి అవకాశం దక్కింది.

అయితే మంత్రివర్గ విస్తరణ సందర్భంగా సీఎం సిద్ధరామయ్య వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కీలక శాఖలను ఆయన తన వద్దే వుంచుకున్నారు. ఆర్ధిక, కేబినెట్ వ్యవహారాలు, బ్యూరోక్రసీ, ఇంటెలిజెన్స్ విభాగాలను సీఎం పర్యవేక్షించనున్నారు. ఇక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌‌కు నీటిపారుదల, బెంగళూరు అభివృద్ధి శాఖలను కేటాయించారు సీఎం. మంత్రుల ఎంపిక, వారికి శాఖల కేటాయింపు అనేది సిద్దూ, డీకేల మధ్య టగ్ ఆఫ్ వార్ అని విశ్లేషకులు తొలి నుంచి చెబుతున్నారు. అయితే తుది ఎంపికలో సీఎం సిద్ధరామయ్యికి ఎక్కువ ప్రాధాన్యత దక్కినట్లే కనిపిస్తోంది. 24 మంది కొత్త మంత్రుల్లో 12 మందికి గతంలో మంత్రులుగా చేసిన అనుభవం లేదు. 

Follow Us:
Download App:
  • android
  • ios