అనారోగ్య కారణాలతో  తాను ఢిల్లీకి వెళ్లడం  లేదని  కర్ణాటక పీసీసీ చీఫ్  డీకే శివకుమార్ ప్రకటించారు.  కడుపులో  ఇన్ ఫెక్షన్ కారణంగా  ఢీల్లీకి వెళ్లడం లేదని  ఆయన  ప్రకటించారు.

న్యూఢిల్లీ: కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఢిల్లీ పర్యటనను వాయిదా రద్దు చేసుకున్నారు. అనారోగ్య కారణాలతో డీకే శివకుమార్ తన ఢిల్లీ టూర్ ను వాయిదా వేసుకున్నారు. 

గత మూడు రోజులుగా డీకే శివకుమార్ కడుపునొప్పిత ఇబ్బందిపడుతున్నారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. ఇవాళ డీకే శివకుమార్ ను ఢిల్లీకి రావాలని పార్టీ నాయకత్వం పిలుపునిచ్చింది. అయితే అనారోగ్య కారణాలతో తన ఢిల్లీ పర్యటనను వాయిదా వేసుకున్నట్టుగా డీకే శివకుమార్ ప్రకటించారు. 

పార్టీ అధిష్టానం పిలుపుమేరకు కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య ఇప్పటికే ఢీల్లీకి చేరుకున్నారు. పార్టీ నాయకలతో ఆయన వరుసగా సమావేశమౌతున్నారు.

ఇవాళ తన గురువు వద్దకు వెళ్లి డీకే శివకుమార్ వెళ్లారు. ఆనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఢిల్లీకి వెళ్లబోనని ప్రకటించారు. అనారోగ్య కారణాలతో ఢీల్లీ పర్యటనను వాయిదా వేసుకున్నానని ఆయన ప్రకటించారు.

రాష్ట్రంలో తాను 135 మంది ఎమ్మెల్యేలను గెలిపించినట్టుగా డీకే శివకుమార్ చెప్పారు. ఆ తర్వాత ఆయన మాట మార్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా తన వర్గమేనని ఆయన డీకే శివకుమార్ ప్రకటించారు.

also read:కాంగ్రెస్ లో కొనసాగుతున్న హైడ్రామా: మల్లికార్జున ఖర్గేతో డీకే సురేష్ భేటీ

డీకే శివకుమార్ కు ఇవాళ రాత్రి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఈ వీడియోను డీకే శివకుమార్ అనుచరులు మీడియాకు విడుదల చేశారు. వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించిన నేపథ్యంలో డీకే శివకుమార్ న్యూఢిల్లీ వెళ్లలేదని ఆయన వర్గీయులు చెబుతున్నారు. రేపు ఉదయం ఏడున్నర గంటల సమయంలో డీకే శివకుమార్ ఢిల్లీకి వెళ్తారని ప్రచారం సాగుతుంది. అయితే ఆరోగ్యం సహకరిస్తేనే డీకే శివకుమార్ ఢీల్లీకి వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు.