Asianet News TeluguAsianet News Telugu

రైతుల కోసం కొడుకుపై ఒట్టేసి...భావోద్వేగానికి లోనైన కర్ణాటక సీఎం

బ్యాంకుల ద్వారా రాష్ట్రంలోని రైతులు తీసుకున్న రుణాలను ఎట్టి పరిస్థితుల్లో మాపీ చేసి తీరతానని కర్ణాటకు ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమార స్వామి స్పష్టం చేశారు. కర్ణాటక ఎన్నికల సందర్భంగా ఇచ్చిన  హామీని నిలబెట్టుకుంటానని స్పష్టం చేశారు. రైతులకు అన్యాయం చేయనని తన ఒక్కగానొక్క కొడుకు నిఖిల్(సినీనటుడు)మీద ఒట్టేసి చెబుతున్నా ... అన్నదాతలు ఆందోళన చెందవద్దంటూ కుమార స్వామి భావోద్వేగానికి లోనయ్యారు. 

karnataka cm kumaraswamy emotional speech about farmers
Author
Karnataka, First Published Dec 29, 2018, 3:25 PM IST

బ్యాంకుల ద్వారా రాష్ట్రంలోని రైతులు తీసుకున్న రుణాలను ఎట్టి పరిస్థితుల్లో మాపీ చేసి తీరతానని కర్ణాటకు ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమార స్వామి స్పష్టం చేశారు. కర్ణాటక ఎన్నికల సందర్భంగా ఇచ్చిన  హామీని నిలబెట్టుకుంటానని స్పష్టం చేశారు. రైతులకు అన్యాయం చేయనని తన ఒక్కగానొక్క కొడుకు నిఖిల్(సినీనటుడు)మీద ఒట్టేసి చెబుతున్నా ... అన్నదాతలు ఆందోళన చెందవద్దంటూ కుమార స్వామి భావోద్వేగానికి లోనయ్యారు. 

భాగల్‌కోట్ జిల్లా రైతులకు రుణ విముక్తి పత్రాల పంపిణీ కార్యక్రమంలో కుమార స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతుల రుణాలను మాఫీ చేయడానికి సంబంధిత అధికారులు, బ్యాంకులతో విస్తృతంగా చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. త్వరలో రాష్ట్రంలోని రైతులందరి రుణాలు మాపీ అవుతాయని...ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. 

తమ ప్రభుత్వం రైతులకు పక్షాన నిలిచి...వారి సమస్యలను పరిష్కరించడానికే పనిచేస్తోందన్నారు. రైతులకు మోసం చేయాలన్న ఆలోచన తమకు ఏమాత్రం  లేదని... అన్నదాతలేవ్వరూ అదైర్యపడొద్దన్నారు. పంటలకు గిట్టుబాట ధర అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని...వచ్చే ఏడాది నుండి రైతులు
పండిచిన పంటకు నికర లాభం ఉండేలా చూసుకుంటామని కుమార స్వామి స్పష్టం చేశారు. 
 
Follow Us:
Download App:
  • android
  • ios