కర్ణాటక అసెంబ్లీలో నేడు బలపరీక్ష జరుగుతోంది. తమ బలాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామికి వచ్చింది. కాగా... ఈ నేపథ్యంలో ఆయన గురువారం అసెంబ్లీలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ వ్యవస్థాపకుడు, సినీనటుడు ఎన్టీఆర్ పేరు ప్రస్తావించడం విశేషం.

సంకీర్ణ ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేసి అధికారాన్ని లాక్కునే కుట్ర జరుగుతోందని కుమారస్వామి ఆరోపించారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఇదే విధంగా అధికారం లాక్కోవాలనే ప్రయత్నాలు జరిగాయని ఈ సందర్భంగా కుమారస్వామి గుర్తు చేశారు. అంతెందుకు కర్ణాటకలోనే రామకృష్ణ గౌడ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి ప్రయత్నాలు జరిగాయని ఆయన అన్నారు.

అప్పుడు జరిగిన సంఘటనలను ఇప్పుడు మళ్లీ చూస్తున్నామని ఆయన అన్నారు. అక్కడి సభ్యులు ఇక్కడికీ, ఇక్కడి సభ్యులు అక్కడికి వెళ్లడం 1985లోనే చూశామని.. అప్పడుు రాజీవ్ గాంధీ ప్రధాన మంత్రిగా ఉన్నారని చెప్పారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని.. తానేమీ సీఎం సీటుకి అతుక్కుపోయి ఉండనని చెప్పారు. ప్రజలు ఎవరిని ఆమోదిస్తే వాళ్లే పాలకులు అవుతారని స్పష్టం చేశారు.