కరోనా మహమ్మారి రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా వదలడం లేదు. మొన్ననే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కరోనా వైరస్ బారిన పడగా... తాజాగా నిన్న కర్ణాటక ముఖ్యమంత్రి యెడ్యూరప్ప వంతు వచ్చింది. 

కర్ణాటక ముఖ్యమంత్రి యెడియూరప్ప కరోనా వైరస్ బారినపడ్డారు. ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా ప్రకటించారు. నిన్నరాత్రి పొద్దుపోయాక ఆయన ఈ  విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలిపారు. 

తాను కరోనా పాజిటివ్ గా తేలానని, తాను ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ... ముందుజాగ్రత్త చర్యగా, డాక్టర్ల సలహా మేరకు ఆసుపత్రిలో చేరినట్టు తెలిపాడు. ఈ మధ్యకాలంలో తనను కలిసినవారు, సన్నిహితంగా మెలిగినవారు క్వారంటైన్ లో ఉండాలని కోరారు యెడియూరప్ప. 

ఇకపోతే నిన్ననే హోమ్ మంత్రి అమిత్ షా కి కూడా కరోనా సోకిందా. అమిత్ షా త్వరగా కోలుకోవాలని యెడియూరప్ప ట్విట్టర్ ద్వారా తన సందేశాన్ని తెలిపిన కొద్దీ ఘంటలకే ఆయన కూడా పాజిటివ్ గా తేలారు. 

అమిత్ షా సైతం ట్విట్టర్ వేదికగానే తనకు కరోనా సోకిందని తెలిపారు. కరోనా లక్షణాలు కన్పించగానే తాను పరీక్షా చేపించుకున్నట్టుగా అమిత్ షా తెలిపారు. ఈ పరీక్షల్లో తనకు కరోనా ఉన్నట్టుగా తేలిందని ఆయన ప్రకటించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన స్పష్టం చేశారు. డాక్టర్ల సలహా మేరకు తాను ఆసుపత్రిలో చేరినట్టుగా ఆయన తెలిపారు. ఈ విషయాన్ని అమిత్ షా ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.