Asianet News TeluguAsianet News Telugu

కర్ణాటక సీఎం యడియూరప్పకు రెండోసారి కరోనా: ఆసుపత్రిలో చికిత్స

 కర్ణాటక సీఎం బీఎస్ యడియూరప్ప కు రెండోసారి కరోనా సోకింది. శుక్రవారం నాడు ఆయన  రామయ్య ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు.
 

Karnataka CM BS Yediyurappa hospitalised lns
Author
Bangalore, First Published Apr 16, 2021, 2:37 PM IST


బెంగుళూరు: కర్ణాటక సీఎం బీఎస్ యడియూరప్ప కు రెండోసారి కరోనా సోకింది. శుక్రవారం నాడు ఆయన  రామయ్య ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. గత ఏడాదిలో కూడ ఆయనకు కరోనా సోకింది. ఆ సమయంలో కరోనా నుండ కోలుకొని విధులు నిర్వహిస్తున్నారు. 

 

రాష్ట్రంలో కరోనా కేసులపై  సీఎం యడియూరప్ప  ఇవాళ ఉదయం సమీక్ష నిర్వహించారు.  ఈ సమీక్ష నిర్వహించిన తర్వాత ఆయనకు స్వల్పంగా జ్వరం వచ్చింది. దీంతో పరీక్షలు నిర్వహిస్తే  కరోనా సోకినట్టుగా తేలింది.  దీంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం అధికారులకు దిశా నిర్ధేశం చేశారు.

అవసరమైతే లాక్ డౌన్ విషయమై ఆలోచిస్తామని యడియూరప్ప సోమవారం నాడు ప్రకటించారు.  రెండు రోజుల క్రితం కూడ ఆయన కరోనా పరీక్షలు చేయించుకొన్నారు. అయితే ఈ పరీక్షల్లో ఆయనకు నెగిటివ్ వచ్చింది. కానీ ఇవాళ మాత్రం ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా తేలింది.తనను కలిసినవారంతా పరీక్షలు చేయించుకోవాలని సీఎం యడియూరప్ప సూచించారు. తన ఆరోగ్యం బాగానే ఉందని ఆయన తెలిపారు.  ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు.

Follow Us:
Download App:
  • android
  • ios