ప్రతి కొవిడ్ పాజిటివ్ కేసును కూలంకుషంగా పరిశీలించాలని ఆరోగ్య శాఖ అధికారులకు సూచించామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వద్దన్నారు. బాధితులPrimary and Secondary Contact లపై నిఘా కొనసాగుతుందన్నారు. క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలకు అనుమతి ఇవ్వాలా, వద్దా అనే అంశంపై త్వరలోనే ప్రభుత్వం స్పష్టత ఇస్తామని బసవరాజ్ బొమ్మై అన్నారు.
నూతన సంవత్సర వేడుకలకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వంపై ఒత్తిడి ఉన్న మాట నిజమేనని.. అయితే మరో వారం తర్వాత covid పరిస్థితిని సమీక్షించి తగిన నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి Basavaraj Bommai ప్రకటించారు. హుబ్బళ్ళిలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కొత్తగా Omicron case లేవీ చూడలేదన్నారు.
ప్రతి కొవిడ్ పాజిటివ్ కేసును కూలంకుషంగా పరిశీలించాలని ఆరోగ్య శాఖ అధికారులకు సూచించామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వద్దన్నారు. బాధితులPrimary and Secondary Contact లపై నిఘా కొనసాగుతుందన్నారు. క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలకు అనుమతి ఇవ్వాలా, వద్దా అనే అంశంపై త్వరలోనే ప్రభుత్వం స్పష్టత ఇస్తామన్నారు.
ప్రజల ఆరోగ్య సంరక్షణ దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. బెళావి శాసనసభ సమావేశాలలో ఉత్తర కర్ణాటక సమస్యలపై విస్తారమైన చర్చ జరగాలన్నది ప్రభుత్వ ఉద్దేశం అని అన్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా పంట నష్టానికి గురైన అన్నదాతలకు పరిహారాన్ని పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. విధానపరిషత్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు బిజెపి కైవసం చేసుకుంటుందని అన్నారు.
శాసనసభ సమావేశాలను కుదించం..
ఒమైక్రాన్ వేరియంట్ నేపథ్యంలో శాసనసభ సమావేశాలను కుదించే ఆలోచన లేదని రెవెన్యూ శాఖ మంత్రి ఆర్. అశోక్ స్పష్టం చేశారు. బెంగళూరు విధాన సౌధ వద్ద మాజీ మంత్రి ముఖ్యమంత్రి నిజలింగప్ప జయంతి సందర్భంగా శుక్రవారం ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ముందుగా నిర్ణయించిన ప్రకారమే శాసనసభ సమావేశాలు రెండు వారాలపాటు జరుగుతాయని అన్నారు. కాగా పరిషత్ ఎన్నికల్లో బిజెపికి 12 స్థానాలు ఖాయమని అంతకంటే ఎక్కువ స్థానాలు రావచ్చునని ఆశిస్తున్నామన్నారు.
ఇదిలా ఉండగా, ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న కొవిడ్ కొత్త వేరియంట్ omicron కేసుల సంఖ్య భారత్‌లోనూ క్రమంగా పెరుగుతుంది. తాజాగా ఇండియాలో మరో ఒమిక్రాన్ కేసు నమోదైంది. Zimbabwe నుంచి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ పాజటివ్‌గా నిర్ధారణ అయినట్టుగా ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. అయితే ఆ వ్యక్తి ఒమిక్రాన్ వెలుగుచూసిన దక్షిణాఫ్రికాను కూడా సందర్శించినట్టుగా పేర్కొంది. దీంతో ఢిల్లీలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 2కి చేరింది. తాజా కేసులతో కలుపుకుని.. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసు సంఖ్య 33కు పెరిగింది.
Bank privatisation: కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా బ్యాంక్ యూనియన్ల సంచలన నిర్ణయం
ఇక, భారత్‌లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. నిన్న ఒక్కరోజే మహారాష్ట్రలో ఏడు కేసులు నమోదయ్యాయి. మొత్తంగా ఇప్పటివరకు దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులను గుర్తించారు. వాటిలో మహారాష్ట్రలో 17, గుజరాత్‌లో 3 , కర్ణాటకలో 2, రాజస్తాన్‌లో 9, ఢిల్లీలో 2 కేసులు ఉన్నాయి.
ఒమిక్రాన్ భయాందోళనల నేపథ్యంలో.. మహారాష్ట్ర రాజధాని ముంబైలో నేడు, రేపు 144 సెక్షన్ విధించారు. ఈ మేరకు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు ఉత్తర్వులు జారీచేశారు. వీకెండ్ కావడంతో జనాలు బయటకు వచ్చే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ఒమిక్రాన్ వ్యాప్తి కట్టడి చేయడంలో భాగంగా ముంబైలో ర్యాలీలు, ఊరేగింపులపై నిషేధం విధించారు. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని ముంబై పోలీసు వర్గాలు తెలిపాయి.
