Karnataka 'chaddi' row: "ఈ సారి క‌ర్నాట‌క‌లో కాంగ్రెస్‌ చెడ్డీ ఊడుతుంది": బీజేపీ ఎంపీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Karnataka 'chaddi' row: కర్ణాట‌క‌లో చెడ్డీ వార్ రోజురోజుకు ఉధృత‌మవుతోంది. తాజాగా కాషాయం నిక్కర్లు కాల్చివేస్తామని కాంగ్రెస్ బెదిరింపుల నేప‌థ్యంలో బిజెపి ఎంపి రమేష్ జిగజినాగి విరుచుకుపడ్డారు. ఇప్ప‌టికే దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీ చెడ్డీలను తొలగించారని, వచ్చే ఎన్నికల్లో కర్నాటక ప్రజలు అదే చేస్తారని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు .
 

Karnataka 'chaddi' row: BJP MP says  People of India have removed Congresss knickers

Karnataka 'chaddi' row: బీజేపీ పాలిత కర్ణాటక రాష్ట్రం వివాదాలకు కేరాఫ్ అడ్రాస్ గా మారుతోంది.  రాష్ట్రంలో ఇప్పటికే ప‌లు వివాదాలు తలెత్తాయి. హిజాబ్ వివాదం ముగిసిపోక ముందే.. హలాల్ వివాదం, ఆ త‌రువాత‌ అజాన్ వివాదం వంటి ప‌లు వివాదాలు రాష్ట్ర రాజకీయాల‌తో పాటు దేశ రాజ‌కీయాల‌ను షేక్ చేశారు. తాజా మ‌రో వివాదం తెరమీదకు వచ్చింది. అదే చెడ్డీ వార్‌.. ఈ వివాదంతో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌ల మ‌ధ్య అట్టుడుకుతోంది.

తాజాగా కాషాయపు నిక్కర్లు తగలబెడతామన్న కాంగ్రెస్‌ బెదిరింపుల నేప‌థ్యంలో బీజేపీ ఎంపీ రమేష్ జిగజినాగి త‌న‌దైన శైలిలో స్పందించారు. ఈ మేరకు విప‌క్ష కాంగ్రెస్ పార్టీపై పలు సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. దేశ‌వ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ చెడ్డీలను ప్ర‌జ‌లే ఊడగొట్టారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కర్ణాటక ప్ర‌జ‌లు కూడా అదే పనిచేస్తారని వ్యంగ్యంగా సంధించారు. అందుకే కాంగ్రెస్‌ నాయకులు పదే పదే చెడ్డీ గురించి మాట్లాడుతున్నారని, వారికీ చెడ్డీ తప్ప మరేం కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. 

వివాదం ఎలా ముదిరిందంటే..?

కర్ణాటకలో పాఠశాల పాఠ్యపుస్తకాల‌ను కాషాయికర‌ణ చేస్తున్నార‌ని ఆరోపణ‌లు చేస్తూ..  కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేస్తోంది.  ఈ క్రమంలో కాంగ్రెస్ విద్యార్థి విభాగం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI) కర్ణాటక రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బిసి నగేష్ నివాసం వెలుపల ప్రదర్శన చేసింది. ఈ క్రమంలో  ఖాకీ నిక్క‌ర్ ను త‌గ‌ల‌బెట్టి మంత్రికి వ్యతిరేకంగా ప్రదర్శన నిర్వహించారు.

అదే సమయంలో, కొంతమంది NSUI కార్యకర్తలు తన ఇంట్లోకి చొరబడి నిప్పటించారని విద్యా మంత్రి ఆరోపించారు. త‌న‌ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఇదంతా జరిగిందనీ, భ‌యాందోళ‌న‌కు గురి చేశార‌ని తెలిపారు.  బీజేపీని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ ఖాకీ చెడ్డీల‌ను తగలబెట్టడం వంటి  దిగజారుడు విన్యాసాలకు పాల్పడుతోందని విమ‌ర్శించారు. కర్ణాటక ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే సమస్యే లేదని మంత్రి అన్నారు. అదే సమయంలో, పాఠశాల పాఠ్యపుస్తకాల‌ కాషాయీకరణ అంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని స్పష్టం చేశారు.
 
అయితే కాంగ్రెస్‌ విద్యార్థి విభాగం సభ్యులు తన ఇంట్లోకి చొరబడి నిప్పటించారని కర్ణాటక విద్యాశాఖ మంత్రి బీసీ నగేష్‌ ఆరోపించారు. ప్రభుత్వంపై దాడి చేసేందుకు మరే ఇతర కారణం లేకపోవడం వల్ల ‘చెడ్డీ కాల్చడం’ వంటి దిగజారుడు విన్యాసాలకు పాల్పడుతోందని కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు.

ఈ క్ర‌మంలో కాంగ్రెస్‌ నిరసనలకు వ్యతిరేకంగా బీజేపీ వినూత్న‌ చర్యలు చేపట్టింది. సిద్ధరామయ్య వ్యాఖ్యలకు నిరసనగా.. ఆర్‌ఎస్సెస్‌ కార్యకర్తలు కాంగ్రెస్‌ కార్యాలయానికి పెద్ద ఎత్తున చడ్డీల‌ను (లోదుస్తులు) పార్సిళ్లను పంపారు. అయితే, తమకు ఎటువంటి పార్సిళ్లు అందలేదని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios