Asianet News TeluguAsianet News Telugu

మంత్రి రాసలీలల కేసు : అరెస్ట్ భయంతో..అజ్ఞాతంలోకి జార్కిహొళి !?

రాసలీలల సీడీ కేసులో మాజీ మంత్రి రమేష్ జార్కి హోళి అరెస్ట్ భయంలో పడ్డారు. ఇన్ని రోజులు అజ్ఞాతంలో ఉన్న సీడీలోని యువతి మంగళవారం సీడీలోని యువతి మంగళవారం కోర్టులో లొంగిపోవడం, జడ్జికి వాంగ్మూలమివ్వడం తెలిసిందే. 

karnataka CD case : Jarkiholi moves to undisclosed location - bsb
Author
Hyderabad, First Published Apr 1, 2021, 9:48 AM IST

రాసలీలల సీడీ కేసులో మాజీ మంత్రి రమేష్ జార్కి హోళి అరెస్ట్ భయంలో పడ్డారు. ఇన్ని రోజులు అజ్ఞాతంలో ఉన్న సీడీలోని యువతి మంగళవారం సీడీలోని యువతి మంగళవారం కోర్టులో లొంగిపోవడం, జడ్జికి వాంగ్మూలమివ్వడం తెలిసిందే. 

బుధవారం ఆమెను సిట్ పోలీసులు తీసుకెళ్లి విచారించారు. రెండు చోట్లా జార్కి హోళి తనను లైంగికంగా వేదింపులు, మోసం, బెదిరింపులకు గురిచేశారని ఆరోపించినట్లు తెలిసింది. 

దీంతో రమేష్ జార్కి హోలి అరెస్ట్ భయంతో ముంబైకి వెళ్లిపోయినట్లు ప్రచారం సాగుతోంది. ఎవరికీ అందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకెళ్లారు.

తాను ఏ తప్పూ చేయలేదని, సీడీ వీడియోలన్నీ కల్పితాలని జార్కి హోళి చెబుతూ ఉన్నారు. యువతి కోర్టు, సిట్‌ ముందుకు వచ్చేసరికి జార్కిహొళి ఆందోళనకు గురయ్యారు. 

ఢిల్లీ నుంచి న్యాయవాదులను రప్పించుకుని తరుణోపాయాలమీద మంతనాలు ప్రారంభించారు. ఢిల్లీకి చెందిన నలుగురు ప్రముఖ న్యాయవాదులతో పాటు కర్ణాటకకు చెందిన మరో ఇద్దరితో చర్చించినట్టు  తెలిసింది.  తనమీదున్న ఎఫ్ఐఆర్ రద్దు కోరుతూ పిటిషన్ వేయాలని నిర్ణయించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios