కర్ణాటక కేబినెట్​ను బుధవారం సీఎం యడియూరప్ప విస్తరించనున్నారు. సాయంత్రంలోగా ఆయన కొత్త మంత్రిమండలి వివరాలు ప్రకటించనున్నారు. ఆ వెంటనే నూతన మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని ఆయన తెలిపారు.

కేబినెట్​లో కొత్తగా ఏడుగురికి చోటు దక్కుతుందని యడియూరప్ప వెల్లడించారు. అయితే ప్రస్తుత కేబినెట్​లో ఎవరికైనా ఉద్వాసన పలుకుతారా అనే అంశంపై మాత్రం యడియూరప్ప క్లారిటీ ఇవ్వలేదు.

అయితే నూతన కేబినెట్​ మంత్రులపై వస్తున్న వార్తలకు, తాను ప్రకటించబోయే దానికి వాస్తవంగా పొంతన ఉండబోదని యడియూరప్ప వెల్లడించారు. మరోవైపు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ జనరల్​ సెక్రెటరీ అరుణ్​ సింగ్​లను ఆహ్వానించనున్నట్లు సీఎం తెలిపారు.

కేబినెట్​ కూర్పుపై కేంద్ర హోంమంత్రి అమిత్​ షా, జేపీ నడ్డాలతో భేటీ యడియూరప్ప అయ్యారు. అనంతరం ఏడుగురికి అవకాశం ఇవ్వబోతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. అయితే ఇద్దరు కేబినెట్​ మంత్రులపై వేటు పడే అవకాశం వుందని బీజేపీలో చర్చ జరుగుతోంది.