02:49 PM (IST) Dec 09

12 చోట్ల బీజేపీ , 2 స్థానాల్లో కాంగ్రెస్ విజయం

కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ ఎదురు లేకుండా దూసుకెళ్లింది. 15 స్థానాలకు గాను 12 చోట్ల విజయం సాధించి అధికారాన్ని నిలబెట్టుకుంది. కాంగ్రెస్ పార్టీ 2 స్థానాలతో సరిపెట్టుకుని అధికారంపై ఆశలు వదులుకుంది. జేడీఎస్ కనీసం ఖాతా తెరవలేకపోగా... మరో చోట స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు.

10:57 AM (IST) Dec 09

12 'స్థానాల్లో బీజేపీ ఆదిక్యం


ఈ నెల 5వ తేదీన జరిగిన ఉప ఎన్నికల్లో 12 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. రెండు స్థానాల్లో కాంగ్రెస్, ఒక్క స్థానంలో స్వతంత్ర అభ్యర్ధి ఆధిక్యంలో ఉన్నారు. 

10:20 AM (IST) Dec 09

10 స్థానాల్లో బీజేపీ ఆధిక్యం

కర్ణాటక అసెంబ్లీలోని 15 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ 10 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతోంది. కాంగ్రెస్, జేడీఎస్‌లు రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

08:28 AM (IST) Dec 09

దూసుకుపోతున్న బీజేపీ


కర్ణాటకలోని 15 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో ఏడు స్థానాల్లో బీజేపీ ఆధిక్యతలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఐదు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఒక్క స్థానంలో జేడీఎస్ స్థానంలో లీడ్ లో ఉంది.

08:08 AM (IST) Dec 09

ప్రారంభమైన ఓట్ల లెక్కింపు

బెంగుళూరులోని కౌంటింగ్ కేంద్రంలో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 15 అసెంబ్లీ స్థానాలకు ఓట్ల లెక్కింపును సోమవారం నాడు ఉదయం 8 గంటలకు ప్రారంభించారు.

07:30 AM (IST) Dec 09

ఆ స్థానాలన్నీ విపక్షాలవే

  • 224 స్థానాలు ఉన్న కర్ణాటక అసెంబ్లీలో బీజేపీ బలం 105 మంది. ఓ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే బీజేపీకి మద్దతును ప్రకటించాడు. దీంతో ఆ పార్టీ బలం 106కు చేరుకొంది. ఉపఎన్నికలు జరిగిన 15 అసెంబ్లీ స్థానాల్లో గతంలో 12 స్థానాల్లో కాంగ్రెస్, మూడు స్థానాల్లో జేడీఎస్ అభ్యర్ధులు విజయం సాధించారు.
07:29 AM (IST) Dec 09

సుప్రీం తీర్పుతో ఆ ఎమ్మెల్యేలకు ఊరట

స్పీకర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అనర్హతకు గురైన ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఈ ఎమ్మెల్యేలు ఎన్నికల్లో పోటీ చేయవచ్చని తీర్పు చెప్పింది. 

07:28 AM (IST) Dec 09

తేలనున్న యడ్యూరప్ప భవితవ్యం


ఈ ఏడాది జూలై మాసంలో జేడీఎస్ కాంగ్రెస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం విశ్వాస తీర్మానం సందర్భంగా అప్పటి సంకీర్ణ కూటమి (జేడీఎస్, కాంగ్రెస్)కి చెందిన ఎమ్మెల్యేలు ఆయా పార్టీల విప్ కు వ్యతిరేకంగా ఓటు చేశారు. విప్‌ను ధిక్కరించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటేశారు