అందరూ కట్ చేసినట్లు కాకుండా బర్త్‌డేకి వెరైటీగా కేక్ కోసిన బీజేపీ నేతను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రం బెళగావి బీజేపీ యువమోర్చా నగర అధ్యక్షుడిగా ఉన్న నిఖిల్ రవికి ఈ నెల 1న పుట్టినరోజు.

ఈ సందర్భంగా స్థానిక గాంధీనగర్‌లో కొందరు యువకులు, బీజేపీ కార్యకర్తలు ఆయన పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా తల్వార్‌తో కేక్ కట్ చేశారు. దీనిని కొందరు యువకులు సోషల్ మీడియాలో పెట్టడంతో ఇది వైరల్ అయ్యింది. దీనిని గమనించిన పోలీసులు నిఖిల్‌ను అదుపులోకి తీసుకుని జైలుకు పంపారు. నిఖిల్‌పై రౌడీ షీట్ ఉంది.. గతంలో ఎనిమిది కేసులు నమోదై ఉన్నాయి.