Asianet News TeluguAsianet News Telugu

బిజెపి ఓటమికి కారణాలివే: యడ్యూరప్ప

కర్ణాటకలో గత  శనివారం జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. ఇందులో భారతీయ జనతా పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రెండు లోక్ సభ, మూడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, జేడిఎస్ కూటమి 4 కైవసం చేసుకోగా బిజెపి కేవలం ఒక్క సీటుతో సరిపెట్టకొవాల్సి వచ్చింది.   
 
karnataka bjp president yedyurappa comments on bypoll results
Author
Karnataka, First Published Nov 6, 2018, 6:30 PM IST

కర్ణాటకలో గత  శనివారం జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. ఇందులో భారతీయ జనతా పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రెండు లోక్ సభ, మూడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, జేడిఎస్ కూటమి 4 కైవసం చేసుకోగా బిజెపి కేవలం ఒక్క సీటుతో సరిపెట్టకొవాల్సి వచ్చింది.

ఈ ఓటమిపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు యడ్యారప్ప స్పందించారు. అధికార అండతో జేడీఎస్, కాంగ్రెస్ కూటమి ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినట్లు యడ్యూరప్ప
ఆరోపించారు. ఈ ఫలితాల వెనుక విపరీతమైన ధన, మద్య ప్రవాహం దాగివున్నాయని తెలిపారు. వీటివల్లే తమ పార్టీ ఓటమికి గురయ్యందే కాని ప్రజల వ్యతిరేకత వల్ల
కాదని యడ్యూరప్ప స్పష్టం చేశారు.

ఇక ఈ ఉపఎన్నికల వల్ల 2019 పార్లమెంట్ ఎన్నికల్లో తాము మరింత జాగ్రత్తగా ఉండాల్సినఅ అవసరం ఉందని అర్థమైందన్నారు. ఈ ఓటమికి దారితీసిన కారణాలను సమీక్షించుకుని పార్లమెంట్ ఎన్నికలకు సిద్దమవుతామని యడ్యూరప్ప తెలిపారు. ఉపఎన్నికల్లో తమ పనితీరు పట్ల ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

పార్లమెంట్ ఎన్నికల వరకు కర్ణాటకలో పార్టీని మరింత బలోపేతం చేసి 22 నుండి 23 ఎంపీలను గెలిపించుకుంటామన్నారు. అందుకోసం ప్రత్యేక కార్యాచరణ  రూపొందించనున్నట్లు పేర్కొన్నారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా తాను పర్యటించనున్నట్లు యడ్యూరప్ప ప్రకటించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios