కర్ణాటకల్ బంద్ కొనసాగుతోంది.  కర్ణాటకలో కన్నడిగులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలని, సరోజినీ మహిషి వరది జారీ చేయాలని డిమాండ్ చేస్తూ కర్ణాటక సంఘటన ఒక్కూట పిలుపునిచ్చాయి.  కర్ణాటక బంద్ కి ఇప్పటి వరకు 600 సంఘాలు, సంస్థలు మద్దతుపలికాయి. 

Also Read అక్రమ సంబంధం.. భర్త ఒంటిపై మసిలే నూనె పోసిన భార్య...

కర్ణాటక లో అధికారంలో ఉన్న బీజేపీ, ప్రతిపక్షాలు అయిన కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు ఈ బంద్ విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడం గమనార్హం. ఈ బంద్ లో భాగంగా గురువారం ఉదయం నుంచి పలు చోట్ల ధర్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలో కేవలం కన్నడిగులకే ఉద్యోగాలు ఇవ్వాలనే నిబంధనతో వ కన్నడ సంఘాలు  చేస్తున్న ధర్నా నేటికి 100 రోజులకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు బంద్ కి పిలుపునిచ్చారు.

బృహత్ బెంగళూరు హోట్సల్ సంఘం మాత్రం ఈ బంద్ కి మద్దతు పలకలేదు. ప్రజలు, ఆహార ప్రియులు ఇబ్బంది పడకుండా చూసుకునే బాధ్యత తమపై ఉందని అందుకే తాము ఈ బంద్ కి సహకరించమని వారు స్పష్టంగా తెలియజేశారు. ఇక కేఎస్ఆర్టీసీ, బెంగళూరు నగరంలో సంచరించే బీఎంటీసీ ఉద్యోగులు మాత్రం నైతికంగా కర్ణాటక బంద్ కి మద్దతు ప్రకటించాయి. అయితే బస్సులు పూర్తిగా నిలిపివేయమని వారు స్పష్టం చేశారు. 

అయితే ఈ బంద్ కి.. ఏపీ సీఎం వైఎస్ జగన్ కి సంబంధం ఏమిటా అని మీకు డౌట్ రావొచ్చు. సంబంధం ఉంది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత 75శాతం ఉద్యోగాలు కేవలం ఆంధ్రప్రదేశ్ కి చెందిన వారికే ఇస్తామంటూ ప్రకటించారు. ఈ నేపథ్యంలో...పక్క రాష్ట్రమైన కర్ణాటకలో కూడా ఇదే సూత్రాన్ని తీసుకురావాలని వాళ్లు డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. తమ రాష్ట్రంలో కూడా 75శాతం ఉద్యోగాలు కన్నడిగులకే ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తూ గత 100 రోజులుగా ధర్నా చేయడం మొదలుపెట్టారు. ఇదిలా ఉంటే.. ఈ బంద్ రేపు కూడా కొనసాగే అకవాశం ఉందని తెలుస్తోంది. ఈ బంద్ నేపథ్యంలో... ఆంధ్ర నుంచి బెంగళూరు వచ్చే బస్సులపై రాళ్లతో దాడులు చేస్తున్నారు. దీంతో పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.