‘‘రాముడు దేవుడే కాదు.. ఎందుకంటే సాధారణ మానవుల్లాగా అతను కూడా అనేక సమస్యలతో సతమతమయ్యాడు’’ అంటూ.. ఓ రచయిత రాసిన పుసక్తం ఇప్పుడు వివాదాలకు కేంద్రంగా మారింది. కర్ణాటకు చెందిన రచయితన కేఎస్ భగవాన్.. తాజాగా కన్నడలో ‘రామ మందిర యేకే బేడ’ (రామ మందిర అవసరం ఏముంది?) అనే పుస్తకం రాశారు. రాముడు అసలు దేవుడే కాదనే అర్థం వచ్చేలా ఆయన ఈ పుస్తకాన్ని రాశారు. 

కాగా.. హిందుత్వ వాదులు రచయితపై మండిపడుతున్నారు.  ఓ హిందుత్వ సంస్థ  ఇప్పటికే ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారి  ఫిర్యాదు మేరకు పోలీసులు భగవాన్‌పై కేసు నమోదు  చేశారు.హిందుత్వ సంస్థలకు చెందిన కొంతమంది భగవాన్‌ ఇంటి ముందు నిరసనలు కూడా చేశారు. 

మరోవైపు ఈ అంశంపై ముఖ్యమంత్రి కుమార స్వామి మౌనం వహించడంపై కర్ణాటక భాజపా మండిపడుతోంది. భగవాన్‌ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తోంది.