Asianet News TeluguAsianet News Telugu

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు: కాంగ్రెస్-బీజేపీల మ‌ధ్య మాట‌ల యుద్ధం !

Bengaluru: సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అత్యధికంగా రుణాలు తీసుకున్నందున రాష్ట్రాన్ని భారీ అప్పుల ఊబిలోకి నెట్టారని రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆరోపించారు. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం దోపిడీ, లంచాలకు పాల్పడుతోందని రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత అయిన మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఘాటు విమర్శలతో విరుచుకుపడ్డారు. 
 

Karnataka Assembly Elections: Congress-BJP war of words, Siddaramaiah Vs Basavaraj Bommai
Author
First Published Feb 5, 2023, 11:47 AM IST

Karnataka Congress Vs BJP : కర్ణాటక రాజకీయాలు కాక రేపుతున్నాయి. అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య కొనసాగుతున్న ఆరోపణలు, విమర్శలు రాష్ట్ర రాజకీయాలను మరింత వెడెక్కిస్తున్నాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య మధ్య విభేదాలు తలెత్తడంతో పాటు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అత్యధికంగా రుణాలు తీసుకున్నందున రాష్ట్రాన్ని భారీ అప్పుల ఊబిలోకి నెట్టారని బసవరాజ్ బొమ్మై శనివారం ఆరోపించారు.  అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం దోపిడీ, లంచాలకు పాల్పడుతోందని రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత అయిన మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఘాటు విమర్శలతో విరుచుకుపడ్డారు. 

బసవ రాజ్ బోమ్మై మాట్లాడుతూ.. కర్ణాటక చరిత్రలో ముఖ్యమంత్రిగా ఐదేళ్ల పాలనలో అత్యధిక రుణం తీసుకున్న ఘనత రాష్ట్ర శాసనసభ ప్రతిపక్ష నేత సిద్ధరామయ్యకే దక్కుతుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇదే క్ర‌మంలో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ అనుకూల ప్రభంజనం వీస్తోందని మాజీ సీఎం సిద్ద‌రామ‌య్య‌ పేర్కొన్నారు. ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్ప‌స్తూ.. గత ఏడాది బడ్జెట్ లో ప్రకటించిన పనుల్లో కేవలం 10 శాతం మాత్రమే అమలు చేశార‌నీ, రాష్ట్ర రుణ సామర్థ్యం రూ.3 లక్షల కోట్లకు చేరుకుందని బీజేపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. దీనిపై బ‌స‌వ‌రాజ్ బొమ్మై స్పందిస్తూ.. గత ఏడాది బడ్జెట్ అమలుకు సంబంధించిన వివరాలను వచ్చే బడ్జెట్ లో ప్రవేశపెడతామనీ, అన్ని విష‌యాలు తెలుస్తాయంటూ కౌంట‌రిచ్చారు.

వరుస ట్వీట్లలో సిద్ధరామయ్య బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతు రుణాలను మాఫీ చేశాననీ, అది ప్రస్తుత ప్రభుత్వం చేయలేదని గుర్తు చేశారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 22 లక్షల 27 వేల మంది రైతులకు రూ.50 వేల చొప్పున మొత్తం రూ.8,165 కోట్లు జమ చేశామన్నారు. వారి రుణం మాఫీ చేశామ‌ని చెప్పారు. అలాగే, బీజేపీ నాయ‌కుల‌ను టార్గెట్ చేస్తూ.. బ‌స‌వ‌రాజ్ బొమ్మై, య‌డియూర‌ప్ప‌, న‌రేంద్ర మోడీలు రైతుల రుణాలు మాఫీ చేశారా?' అని ప్రశ్నించారు.

 

దోపిడీకి పాల్పడిన 'అలీబాబా అండ్ 40 థీవ్స్' కథతో రాష్ట్ర ప్రభుత్వాన్ని పోల్చారు. బీజేపీ ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి రాలేదని, ఎమ్మెల్యేలకు రూ.15-20 కోట్లు ఇచ్చి..  ప్ర‌జా ప్ర‌భుత్వాన్ని కూల్చి బీజేపీ అధికారం ద‌క్కించుకుంద‌ని విమ‌ర్శించారు. ఇదిలావుండ‌గా, త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ఇంచార్జ్‌గా బీజేపీ శనివారం నియమించింది. ఏప్రిల్-మే నెలల్లో జరగనున్న ఎన్నికల కోసం అధికార పార్టీ, ప్రతిపక్ష కాంగ్రెస్ ముమ్మరంగా ప్రజాసమీకరణ చేపట్టిన ఈ ఎన్నికలకు తమిళనాడు బీజేపీ శాఖ అధ్యక్షుడు కె.అన్నామలై సహ ఇన్చార్జిగా వ్యవహరించనున్నారు. కాంగ్రెస్ సైతం ఎన్నిక‌ల ప్ర‌చారం ముమ్మ‌రం చేసింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ చేపట్టిన 'ప్రజా ధ్వని యాత్ర'లో భాగంగా కర్ణాటక ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ శుక్రవారం నుంచి వేర్వేరుగా బస్సు యాత్రను చేప‌ట్టారు.

Follow Us:
Download App:
  • android
  • ios