Asianet News TeluguAsianet News Telugu

Karnataka Election: గెలుపు మాదే.. జేడీ(ఎస్)తో పొత్తు పెట్టుకోబోం: కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్

Karnataka Assembly Election: కర్ణాటకలోని 224 అసెంబ్లీ స్థానాలకు బుధవారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. 2,615 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు నిర్ణయిస్తారు. ఉదయం 11 గంటల వరకు 20.99 శాతం పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 37.25 శాతం పోలింగ్ నమోదు కాగా, ఉడిపి జిల్లాలో అత్యధికంగా 47.79 శాతం పోలింగ్ నమోదైంది. 
 

Karnataka Assembly Election:Won't ally with JD(S): Karnataka Congress chief DK Shivakumar RMA
Author
First Published May 10, 2023, 3:15 PM IST

Karnataka Congress chief Shivakumar: క‌ర్నాట‌క పోలింగ్ క్ర‌మంలో రాష్ట్రంలోని ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీలు గెలుపుపై ధీమాగా ఉన్నాయి. రికార్డు స్థాయి మెజారిటీతో అధికారంలోకి వ‌స్తామ‌ని కాంగ్రెస్, బీజేపీ నేత‌లు ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్ క‌ర్నాట‌క చీఫ్ డీకే. శివ‌కుమార్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ అధిక మెజారిటీతో అధికారంలోకి వ‌స్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు. అలాగే, జేడీ(ఎస్) పొత్తు గురించి కూడా ఆయ‌న ప్ర‌స్తావించారు. 

కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివ‌కుమార్ త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్న త‌ర్వాత మీడియాతో మాట్లాడుతూ.. జనతాదళ్ (సెక్యులర్) (జేడీ(ఎస్‌)తో ఎన్నికల అనంతర పొత్తు ఉండ‌ద‌ని పేర్కొన్నారు. తమ పార్టీకి 224-లో పూర్తి మెజారిటీ అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. "ఇక్కడ సమస్య ధరల పెరుగుదల, అవినీతి, సుపరిపాలన, అభివృద్ధి... జేడీఎస్ తో పొత్తు పెట్టుకునే అవకాశాలు లేవు. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం" అని కర్ణాటక శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం శివకుమార్ విలేకరులతో అన్నారు.
అంతకుముందు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా కాంగ్రెస్ కు 130-150 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

బీజేపీ పాలిత రాష్ట్రంలో ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని బయటకు వచ్చి ఓటు వేయాలని కర్ణాటక ప్రజలకు డీకే శివకుమార్ విజ్ఞప్తి చేశారు. సిలిండ‌ర్ ధ‌ర‌ల‌ను సైతం ఆయ‌న ప్ర‌స్తావించారు. దయచేసి అంద‌రూ త‌మ గ్యాస్ సిలిండర్లను చూసి ఓటు వేయండి అంటూ విజ్ఞప్తి చేశారు. బూత్ బయట గ్యాస్ సిలిండర్ పెట్టి దానికి పూలదండ వేయాలని త‌మ నేతలందరికీ సూచించిన‌ట్టు కూడా పేర్కొన్నారు. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ ఒక రోజు క్రితం గ్యాస్ సిలిండర్ కు హారతి ఇచ్చారు, దీనికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్ పార్టీ సోష‌ల్ మీడియా హ్యాండిల్ లో పోస్ట్ చేశారు. 

కర్ణాటకలో మార్పు కోసం ఓటు వేయాలని యువ ఓటర్లను కోరిన ఆయన, కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ కు 141 సీట్లు ఇస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. "ఈ రోజు యువ ఓటర్లకు గొప్ప అవకాశం ఉందని, వారు మార్పు కోసం ఓటు వేస్తారు" అని అన్నారు. రాష్ట్రంలో ధరల పెరుగుదల, అవినీతి గురించి వారికి తెలుస‌నీ, వారు మార్పు కోసం వెళ్లి మాకు 141 సీట్లు ఇస్తారని తాను నమ్ముతున్నానని ఆయన అన్నారు. శివకుమార్ తన నియోజకవర్గం కనకపురలో ఓటు వేసిన తర్వాత ఆటో నడుపుతూ కనిపించారు.

 

 

Follow Us:
Download App:
  • android
  • ios