Asianet News TeluguAsianet News Telugu

Karnataka Assembly Election: ఓటు హ‌క్కు వినియోగించుకున్న ప్ర‌కాశ్ రాజ్, ర‌మేష్ అర‌వింద్.. ప‌లువురు ప్రముఖులు

Karnataka Assembly Election:కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు 2,615 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, బీజేపీకి, కాంగ్రెస్ కు ఎక్కువ స్థానాల్లో పోటీ ప‌డుతున్నాయి. బుధ‌వారం ఉద‌యం 7 గంట‌ల‌కు ఓటింగ్ షురూ అయింది. మొత్తం 58,545 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరగనుండగా కొత్తగా 42,48,028 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
 

Karnataka Assembly Election: Many film actors including Prakash Raj and Ramesh Aravind cast their votes
Author
First Published May 10, 2023, 12:20 PM IST

Prakash Raj, Amulya, other actors cast votes: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ బుధవారం బెంగళూరులోని శాంతి నగర్ లోని సెయింట్ జోసెఫ్ స్కూల్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా ఓటు వేయాలనీ. కర్ణాటక అందంగా ఉండాలని ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యానించారు.

 

 

ప్రకాశ్ రాజ్ తో పాటు ప‌లువురు నటులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బెంగళూరులోని ఆర్ఆర్ నగర్ లోని పోలింగ్ బూత్ లో అమూల్య తన భర్తతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. గణేష్, ఆయన సతీమణి, నటుడు రమేష్ అరవింద్ బెంగళూరులోని ఆర్ఆర్ నగర్ లోని పోలింగ్ బూత్ కు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

 

 

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకు కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఉదయం 9 గంటల వరకు 7.83 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఈ ఎన్నికల బ‌రిలో నిలిచిన‌ 2,615 మంది అభ్యర్థుల భవితవ్యం త్వ‌ర‌లోనే తేలనుంది. ఉదయం 9 గంటల వరకు దక్షిణ కన్నడలో అత్యధికంగా 12.47 శాతం పోలింగ్ నమోదైందని స‌మాచారం. 

కర్ణాటకలోని 224 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా 2,615 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) సెంట్రల్లో 7.89 శాతం, బీబీఎంపీ (నార్త్)లో 7.55 శాతం, బీబీఎంపీ (సౌత్)లో 8.22 శాతం, బాగల్కోట్ లో 8.52 శాతం, బెంగళూరు రూరల్లో 7.72 శాతం, బెంగళూరు అర్బన్ లో 9.11 శాతం, బెల్గాంలో ఉదయం 7.47 గంటల వరకు పోలింగ్ నమోదైంది.

అవినీతి ఆరోప‌ణ‌ల‌ను అధిగమించి తిరిగి అధికారంలోకి రావాలని భావిస్తున్న అధికార బీజేపీకి, ఎన్నికల పునరుజ్జీవనం కోసం చూస్తున్న కాంగ్రెస్ కు ఈ అసెంబ్లీ ఎన్నికలు కీలక పరీక్షగా చెప్ప‌వ‌చ్చు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, రాష్ట్ర మంత్రి కె.సుధాకర్, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ సహా పలువురు కీలక నేతలు త‌మ ఓటు హ‌క్కును ఉప‌యోగించుకున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios