కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదివారంనాడు మోటార్ బైక్ పై ప్రచారానికి వెళ్లారు. బైక్ పై ఆయన సామాన్యుడి మాదిరిగా ప్రచారానికి వెళ్లారు.
బెంగుళూరు: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదివారంనాడు మోటార్ బైక్ పై ప్రచారం నిర్వహించారు. పుడ్ డెలీవరీ బైక్ పై రాహుల్ గాందీ ప్రచారానికి వెళ్లారు. కర్ణాటక అసెంబ్లీకి ఈ నెల 10న ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రచారాన్ని అన్ని పార్టీలు మరింత ఉధృతం చేశాయి. బెంగుళూరు నగరంలో తాను ప్రచారం చేయాలనుకున్న ప్రాంతానికి రాహుల్ గాంధీ బైక్ పై చేరుకున్నారు. బైక్ పై వెనకు కూర్చున్న రాహుల్ గాంధీ హెల్మెట్ ధరించాడు.
ఇవాళ బెంగుళూరులో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రోడ్ షో నిర్వహించారు. మోడీ రనోడ్ షో తో ట్రాఫిక్ కు ఇబ్బందులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
కర్ణాటకలో ఈ దఫా ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పట్టుదలతో ప్రచారం చేస్తుంది. మరోవైపు అధికారాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. దక్షిణాదిలో బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రం కర్ణాటక మాత్రమే,. కర్ణాటకలో బీజేపీ మరోసారి అధికారం నిలుపుకుంటే రానున్న రోజుల్లో దక్షిణాదిలో జరిగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ఈ ప్రభావం ఉంటుందని బీజేపీ శ్రేణులు విశ్వసిస్తున్నాయి. కర్ణాటక అసెంబ్లీలో 224 స్థానాలున్నాయి. ప్రస్తుతం బీజేపీకి 119 మంది సభ్యులున్నారు. కాంగ్రెస్ కు 75 మంది, జేడీఎస్ కు 28 మంది ఎమ్మెల్యేలున్నారు.
2018 ఎన్నికల్లో కర్ణాటక ఓటర్లు ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీని ఇవ్వలేదు. కర్ణాటక అసెంబ్లీలో 224 స్థానాలున్నాయి. ప్రస్తుతం బీజేపీకి 119 మంది సభ్యులున్నారు. కాంగ్రెస్ కు 75 మంది, జేడీఎస్ కు 28 మంది ఎమ్మెల్యేలున్నారు. 2018 ఎన్నికల్లో కర్ణాటక ఓటర్లు ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీని ఇవ్వలేదు.
