కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకొని  కాంగ్రెస్ పార్టీ  ఎన్నికల మేనిఫెస్టోను  ఇవాళ విడుదల  చేసింది.  గ్యారంటీ కార్డు పేరుతో  ఐదు  హామీలను  కాంగ్రెస్  ఇచ్చింది.  

బెంగుళూరు : గ్యారంటీ కార్డు పేరుతో ఐదు హామీలను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ . కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈ నెల 10న అసెంబ్లీకి జరిగే ఎన్నికలను పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోను మంగళవారంనాడు విడుదల చేసింది.

 200 యూనిట్లతో ఉచిత విద్యుత్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ప్రతి గృహిణి రూ. 2 వేలు , పది కిలోల బియ్యం. అందిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. మహిళలకు ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందిస్తామని తెలిపింది. నిరుద్యోగ భృతి కింద నెలకు రూ. 3 వేలు,. డిప్లొమా చేసిన వారికి రూ. 1500 చెల్లించనున్నట్టుగా కాంగ్రెస్ హామీ ఇచ్చింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది. 2006 తర్వాత నియమితులైన ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ పొందుతారని కాంగ్రెస్ ప్రకటించింది. మంగళవారంనాడు బెంగుళూరులో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు.

ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖలో 20 ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. పోలీస్ నియామాకాల విషయంలో కాంగ్రెస్ పార్టీ కీలక హామీలు ఇచ్చింది. పోలీస్ శాఖలో మూడింట ఒక వంతు మహిళలను భర్తీ చేస్తామని ప్రకటించింది. మరో వైపు థర్డ్ జెండర్ కోసం కూడా పోలీస్ శాఖలో ఉద్యోగాలను రిజర్వ్ చేయనున్నట్టుగా కాంగ్రెస్ తెలిపింది. సైబర్ , ఆర్ధిక నేరాలను నిరోధించడం కోసం రూ. 200 కోట్లు నిధులను కేటాయించనున్నట్టుగా కాంగ్రెస్ ప్రకటించింది.