కార్గిల్ యుద్దంలో పాకిస్థాన్ ముష్కర మూకలను తరిమికొట్టి ధైర్యానికి, అంకితభావానికి, దేశరక్షణ కోసం ముందుండి పోరాడిన కెప్టెన్ అఖిలేష్ ఒక నిలువెత్తు ఉదాహరణ.
కార్గిల్ యుద్ధంలో భారత్ విజయం సాధించి నేటికీ 22 ఏండ్లు. పాకిస్తాన్ చొరబాటుదారులు భారత భూభాగంలోకి చొరబడి అతి కీలకమైన పర్వత శ్రేణులను ఆక్రమించుకొని భారత బలగాల మీద దాడి చేస్తున్నాయి. లాహోర్ ఒప్పందంపై చేసిన సంతకం తాలుకు ఇన్క్ కూడా ఆరిపోకముందే భారత్ పై యుద్ధానికి కాలుదువ్వింది పాక్.
లాహోర్ కి బస్సులో అప్పటి ప్రధాని అటల్ బిహారి వాజపేయి వెళ్లి భారత్ పాక్ మధ్య లాహోర్ ఒప్పందాన్ని కుదుర్చుకొని వచ్చిన నేపథ్యంలో... అప్పటి పాక్ ఆర్మీ జనరల్ ముషారఫ్ భారత భూభాగంలోకి చొరబాటుదారులను పంపి భారత్ తో యుద్ధానికి తెరలేపాడు. వారు పాకిస్తానీ సైనికుల్ని పాక్ అంగీకరించకపోయినా... వచ్చింది పాకిస్తాన్ సైనికులనేది సుస్పష్టం.
కార్గిల్ సెక్టార్ లో ముష్కరులు తమ ఆధీనంలోకి తీసుకున్న పర్వతాలను తిరిగి దక్కించుకొని వారిని తరిమికొట్టేందుకు భారత ప్రభుత్వం ఆపరేషన్ విజయ్ ని లాంచ్ చేసింది. పెళ్ళైన వారల వ్యవధిలోనే కెప్టెన్ అఖిలేష్ సక్సేనాని కార్గిల్ లో పోస్ట్ చేసారు. 2రాజపుతాన రైఫిల్స్ లో ఆర్టిలరీ ఆఫీసర్ గా సేవలందించిన ఈ కెప్టెన్ బృందం టోలోలింగ్,హాంప్, త్రి పింపుల్స్ పీక్స్ ని తిరిగి చేజిక్కించుకోవడంలో సఫలీకృతమైంది.
ధైర్యానికి,అంకితభావానికి,దేశరక్షణ కోసం ముందుండి పోరాడిన కెప్టెన్ అఖిలేష్ ఒక నిలువెత్తు ఉదాహరణ. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఆయన తన అనుభవాలను ఏషియానెట్ తో ప్రత్యేకంగా పంచుకున్నారు. ఆ వీడియో మీకోసం.
