జులై 26- విజయ్ దివస్. కార్గిల్ లో పాకిస్తాన్ సైన్యం, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత దేశంలోకి చొరబడితే... ఆ చొరబాటుదారులను ఏరివేసి వారిని తరిమి తరిమి కొట్టింది భారత సైన్యం. ఈ  విజయం సాధించిన రోజునే మనం విజయ్ దివస్ గా జరుపుకులుంటాము. ఆ సంఘటనకు నేటికీ 20 ఏండ్లు. 

ఈ విజయ్ దివస్ ని మనం కేవలం 2009 నుండి మాత్రమే జరుపుకుంటున్నాము. రాజ్యసభ ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ పదే పదే అప్పటి యూపీఏ ప్రభుత్వానికి విజ్ఞాపనల మీద విజ్ఞాపనలు పెట్టగా ఇది సాకారమైంది. 

ఈ విషయాన్నీ స్వయంగా రాజీవ్ చంద్ర శేఖరే ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. అప్పటి ప్రభుత్వానికి రాజీవ్ చంద్రశేఖర్ ఎన్నో విజ్ఞాపనలు చేసినప్పటికీ... వారు పట్టించుకోలేదు. ఎట్టకేలకు 2009 లో తొలి విజయ్ దివస్ ని మనం జరుపుకున్నాము. 

ప్రతిసంవత్సరం కార్గిల్ వీరుల స్మృత్యర్థం త్యాగధనులు స్మరిస్తూ వారికి నివాళులర్పించినప్పటికీ... ఇండియా గేట్ వద్దగల అమర్ జవాన్ జ్యోతి వద్ద మాత్రం నిర్వహించేవారు కాదు. కానీ 2009 నుండి ఈ సంప్రదాయాన్ని మొదలుపెట్టింది అప్పటి ప్రభుత్వం. 

తాను ప్రభుత్వానికి రాసిన లేఖలు, ప్రభుత్వం తనకు రాసిన లేఖను ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ లో షేర్ చేసారు. అంతే కాకుండా గత కొన్ని సంవత్సరాలుగా ప్రతిసంవత్సరం ఆయన నివాళులర్పించి ఫోటోలను సైతం జత చేసారు.