కరోనా వైరస్ కారణంగా మరణిస్తున్న ప్రముఖల సంఖ్య దేశంలో అంతకంతకూ పెరుగుతోంది. ఈ క్రమంలో కోవిడ్ బారినపడి కన్యాకుమారి ఎంపీ హెచ్. వసంత్ కుమార్ కన్నుమూశారు. ఆయన వయసు 70 సంవత్సరాలు.

తెలంగాణ గవర్నర్ తమిళిసైకి వసంత్ కుమార్ బాబాయ్ అవుతారు. వసంత్ అండ్ కో పేరిట ఆయన చైన్‌స్టోర్ నిర్వహిస్తున్నారు. ఆయన సోదరుడు అనంతన్ గతంలో తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు.