స్నేహితుడి చెల్లెకు మత్తుమందు ఇచ్చి సామూహిక అత్యాచారం చేసిన దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్, కాన్పూరులో జరిగింది. తన అన్న స్నేహితులే తన పాలిట యమకింకరులగా మారతారని ఆ మైనర్ బాలిక ఊహించలేదు. 

వివరాల్లోకి వెడితే కాన్పూర్ నగరంలోని లాల్ బంగ్లా ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలికపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. అయితే దర్యాప్తులో వారు ఆమె సోదరుడి స్నేహితులుగా తేలడంతో షాక్ కి గురయ్యారు. మైనర్ బాలికకు నలుగురు స్నేహితులు పానీయంలో మత్తు మందు కలిపి తాగించారు.

ఆ తరువాత స్పృహ కోల్పోయిన ఆ అమ్మాయిపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఈ ఘటనపై తాము ఐపీసీ సెక్షన్ 328, 342,363,376 (డి), పోస్కో చట్టాల కింద కేసు నమోదు చేశామని కాన్పూర్ ఎస్పీ రాజ్ కుమార్ అగర్వాల్ చెప్పారు. 

అత్యాచారం చేసిన ఇద్దరిని అరెస్టు చేశామని ఎస్పీ చెప్పారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని ఎస్పీ చెప్పారు. బాలిక సోదరుడి స్నేహితులే ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులు చెప్పారు.