పెళ్ళైన 15 రోజులకే ట్విస్టిచ్చిన భార్య, ప్రియుడితో పెళ్ళి చేసిన భర్త

kanpur husband married his wife to her   lover
Highlights

ప్రియుడతో భార్యకు పెళ్ళి

లక్నో:ప్రేమించిన వ్యక్తిని కాకుండా మరో వ్యక్తిని పెళ్ళి
చేసుకొన్న వివాహితను భర్తే దగ్గరుండి ప్రియుడితో వివాహం
చేసిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.

బాలీవుడ్ బ్లాక్ బ్లస్టర్ మూవీ హమ్ దిల్ దే చుకే సనమ్  లో
ప్రియుడికి తన భార్యను ఇచ్చిన వివాహం చేస్తారు.ఈ
సినిమాలో మాదిరిగానే యూపీలో ఓ ఘటన చోటు చేసుకొంది.

యూపీ రాష్ట్రంలోని శనిగ్వాన్ గ్రామానికి చెదిన సుజిత్
అలియాస్ గోలు తన భార్య శాంతిని ఆమె ప్రియుడైన
రవికిచ్చి వివాహం చేశాడు. 


 శనిగ్వాన్ గ్రామానికి సుజిత్  ఈ ఏడాది ఫిబ్రవరి 19వ తేదిన
శ్యామ్ నగర్ కు చెందిన శాంతిని వివాహం చేసుకొన్నాడు.

పెళ్ళైన 15 రోజులకే శాంతి అత్తింటి నుండి పుట్టింటికి
వెళ్ళిపోయింది. అయితే భార్య ఎంతకీ అత్తింటికి రాలేదు.
అయితే ఈ విషయమై పుట్టింట్లో ఉన్న శాంతిని భర్త సుజత్
ప్రశ్నించాడు.


అయితే పెళ్ళికి ముందే లక్నోకు చెందిన రవి అనే
యువకుడిని తాను ప్రేమించినట్టుగా శాంతి చెప్పింది.
అయితే ఈ విషయమై శాంతి తల్లిదండ్రులను ఒప్పించి
ప్రియుడితో శాంతికి వివాహం చేస్తానని మాటిచ్చాడు.

అయితే ఈ విషయమై శాంతి తల్లిదండ్రులను ఒప్పించడమే
కాకుండా ప్రియుడు రవిని కూడ కలిసి పెళ్ళికి ఒప్పించాడు.
శనిగ్వాన్ గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో  శాంతికి ,
రవికి సుజిత్ దగ్గరుండి పెళ్ళి జరిపించాడు. సుజిత్ కృషిని
గ్రామ పెద్దలు అభినందించారు.
 

loader