Asianet News TeluguAsianet News Telugu

కుటుంబ క‌ల‌హాలు.. అనుమాన‌స్ప‌ద స్థితిలో మ‌హిళ‌, రెండ్లేండ్ల కొడుకు మృతి

Kanpur: కుటుంబ కలహాలతో కాన్పూర్‌లో కొడుకును చంపిన ఒక మహిళ, ఆ త‌ర్వాత త‌న ప్రాణాలు కూడా తీసుకుంది. అయితే ఈ మ‌ర‌ణాల‌పై ప‌లు అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మృతురాలి కుటుంబ స‌భ్యులు అత్తామామ‌లు వారిని హ‌త్య చేశార‌ని ఆరోపించారు. కేసు న‌మోదుచేసుకున్న పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు. 
 

Kanpur : Family quarrels; Woman and two-year-old son died in suspicious condition
Author
First Published Nov 30, 2022, 11:53 PM IST

Uttar Pradesh: కుటుంబ కలహాలతో కాన్పూర్‌లో కొడుకును చంపిన ఒక మహిళ, ఆ త‌ర్వాత త‌న ప్రాణాలు కూడా తీసుకుంది. అయితే ఈ మ‌ర‌ణాల‌పై ప‌లు అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మృతురాలి కుటుంబ స‌భ్యులు అత్తామామ‌లు వారిని హ‌త్య చేశార‌ని ఆరోపించారు. కేసు న‌మోదుచేసుకున్న పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో చోటుచేసుకుంది. 

వివ‌రాల్లోకెళ్తే.. కాన్పూర్‌లో కుటుంబ కలహాలతో ఒక మహిళ తన 2 ఏళ్ల కొడుకును చంపి తన జీవితాన్ని ముగించుకుంది. కాన్పూర్‌లోని రావత్‌పూర్‌లోని మస్వాన్‌పూర్‌లో భర్త, కొడుకు, అత్తమామలతో కలిసి జీవించే సీమా అనే మహిళ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సీమా 2019లో విశాల్‌ను వివాహం చేసుకుంది. వారికి మనన్ అనే రేండేండ్ల‌ కుమారుడు ఉన్నాడు. మంగళవారం సీమ ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని ఆమె తండ్రికి ఫోన్ వచ్చింది. 

అయితే, మృతురాలి కుటుంబ సభ్యులు ఆమె వద్దకు చేరుకుని అత్తమామలు ఆమెను చిత్రహింసలకు గురిచేసి హత్య చేశారని ఆరోపించారు. పెళ్లయినప్పటి నుంచి సీమను అత్తమామలు చిత్రహింసలకు గురిచేస్తున్నారని మృతురాలి తండ్రి పోలీసులకు తెలిపారు. అయితే ఈ మధ్య కాలంలో సీమ, విశాల్ మధ్య చాలా గొడవలు జరుగుతున్నాయని బంధువులు వెల్లడించారు. బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్లి తిరిగి వచ్చినప్పటి నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. విశాల్ వేదికపై మహిళా డ్యాన్సర్‌తో కలిసి డ్యాన్స్ చేయడం సీమకు కోపం తెప్పించిందని బంధువులు పేర్కొన్నారు. 

ఈ క్ర‌మంలోనే అక్క‌డి నుంచి సీమా త‌న భ‌ర్త‌ను కింద‌కు లాగింది. ఇది వారి మ‌ధ్య పెద్ద గొడ‌వ‌కు కార‌ణ‌మైంది. పెళ్లి నుంచి వచ్చిన తర్వాత కూడా వారు గొడవప‌డుతూనే ఉన్నారు. ఇరువర్గాల వాంగ్మూలాలను పరిశీలిస్తే.. ప్రాథమికంగా ఈ కేసు అనుమానాస్పదంగా ఉందని ఏసీపీ తెలిపారు. ఫోరెన్సిక్ బృందం, పోలీసులు ఆధారాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. కుటుంబ సభ్యుల నుంచి ఇంకా ఎలాంటి ఫిర్యాదు అందలేద‌ని పోలీసులు తెలిపారు.

ఛత్తీస్‌ గఢ్‌ లో..

పోర్న్ చూడడానికి అలవాటు పడ్డ ఓ 17యేళ్ల కుర్రాడు.. పదేళ్ల బాలికపై లైంగికదాడి చేసి..ఆ తరువాత గొంతుకోసి చంపేశాడు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని బెమెతారాలో మంగళవారం జరిగింది. ఈ మేరకు పోలీసులు వివరాలు వెల్లడించారు. తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాలకు వెళ్లిన తరువాత ఆ అబ్బాయి. టెర్రస్‌పై నుంచి పక్కింట్లోకి చొరబడ్డాడు. ఒంటరిగా ఉన్న పదేళ్ల బాలిక మీద అత్యాచారం చేశాడు. ఆ తరువాత ఆమెను చంపేసి.. ఓ వెదురు బొంగుకు వేలాడదీశాడు. ఆత్మహత్యగానో, ప్రమాదవశాత్తు బొంగుకు ఉరిపడి మరణించినట్లుగానో చిత్రీకరించడానికి ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు. చిన్నారి అంత ఎత్తులో ఉరేసుకోవడం అసాధ్యంగా కనిపించడంతో పోలీసులు అది హత్యగా అనుమానించి దర్యాప్తు మొదలుపెట్టారు. వెన్నులో ఒణుకు పుట్టించే ఈ ఘటన నవంబర్ 26న రాయ్‌పూర్‌కు 90కి.మీ దూరంలో ఉన్న గ్రామంలో జరిగింది. దర్యాప్తు తరువాత సోమవారం నాడు బాలనేరస్థుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని మీద మైనర్‌పై అత్యాచారం, హత్య కేసు నమోదు చేసి, దుర్గ్ జిల్లాలోని రిమాండ్ హోమ్‌కు పంపారని పోలీసులు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios