Kanpur communal clashes: కాన్పూర్ హింస‌త్మాక ఘ‌ట‌న‌లో 36 మందిని  అరెస్టు చేసి 3 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. పరిస్థితి అదుపులో ఉందని, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు కమిషనర్ విజయ్ సింగ్ మీనా తెలిపారు. సున్నితమైన ప్రాంతాల్లో పోలీసులను మోహరించామ‌నీ,  కాన్పూర్‌లోని యతీం ఖానా, పరేడ్ క్రాస్‌రోడ్‌ల వ‌ద్ద భద్రతను కట్టుదిట్టం చేశామ‌ని తెలిపారు.. 

 Kanpur communal clashes: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ లో ప‌లు హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు చోటుచేసుకున్నాయి. శుక్రవారం ప్రార్థనల అనంతరం ఓ మసీదు వ‌ద్ద హింస చెలరేగింది. రెండు వర్గాల ప్రజల మధ్య రాళ్ల దాడి జరిగింది. పరిస్థితిని అదుపు చేసేందుకు హింసాత్మక ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ప‌రిస్థితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘ‌ట‌న‌లో ఇప్పటి వరకు 3 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి.. 36 మందిని అదుపు తీసుకున్నారు. సున్నితమైన ప్రాంతాల్లో భారీ మొత్తంలో పోలీసులను మోహరించారు. కాన్పూర్‌లోని యతీం ఖానా, పరేడ్ క్రాస్‌రోడ్‌ల వ‌ద్ద భద్రతను కట్టుదిట్టం ఏర్పాటు చేశారు.

ఇటీవ‌ల మొహ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై ఓ బీజేపీ ప్ర‌తినిధి ఓ టీవీ చ‌ర్చ‌లో అనుచిత వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఆ వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తూ.. ముస్లిం మ‌త సంస్థ‌లు కాన్పూర్‌లో శుక్ర‌వారం బంద్ కు పిలుపునిచ్చాయి. బంద్ స‌మ‌యంలో రెండు వ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటుచేసుకున్న‌ది. ఈ ఘర్షణలో ఇద్దరు వ్యక్తులు, ఒక పోలీసు గాయపడ్డారు.

కాన్పూర్ హింసాకాండ పై పోలీసు కమిషనర్ విజయ్ సింగ్ మీనా మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం పరిస్థితి సాధారణంగా ఉంది, భద్రతా బలగాలు ప్రతిచోటా మోహరించామ‌ని తెలిపారు. ఈ ఘ‌ట‌న‌లో 36 మందిని అరెస్టు చేసి 3 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామ‌ని తెలిపారు. ప్ర‌స్తుతం పరిస్థితి అదుపులో ఉందని, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు కమిషనర్ తెలిపారు. సున్నితమైన ప్రాంతాల్లో పోలీసులను మోహరించామ‌నీ, కాన్పూర్‌లోని యతీం ఖానా, పరేడ్ క్రాస్‌రోడ్‌ల వ‌ద్ద భద్రతను కట్టుదిట్టం చేశామ‌ని తెలిపారు..

ఘ‌ట‌న ప్రాంతాల్లో స్వాధీనం చేసుకున్న ఫోటోలు, వీడియో ఆధారంగా మరింత మంది నిందితుల‌ను గుర్తిస్తున్న‌ట్టు తెలిపారు. గ్యాంగ్‌స్టర్ చట్టం కింద కుట్ర దారులపై చర్యలు తీసుకుంటామ‌ని, వారి ఆస్తులను స్వాధీనం చేసుకోవడం లేదా కూల్చివేయడం జరుగుతుందని ఆయన అన్నారు. కొందరు వ్యక్తులు దుకాణాలను మూసివేయడానికి ప్రయత్నించడంతో ఇతర వర్గం వ్యతిరేకించడంతో హింస మొదలైందని తెలిపారు.త్వరలోనే కుట్రదారులందరినీ, సంఘటన స్థలంలో ఉన్న వ్యక్తులను అరెస్టు చేసి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, NSA వాతావరణం ఉండేలా దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామ‌ని తెలిపారు. 

ఏంటి విషయం?

బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ.. ఒక టీవీ న్యూస్‌ చర్చ కార్యక్రమంలో మహ్మద్‌ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు త‌లెత్తాయి. ఆమెపై ప‌లు చోట్ల ముస్లీం మ‌త‌సంస్థ‌లు కేసు నమోదు. నుపుర్‌ శర్మ వ్యాఖ్యలపై ఇప్పటికే నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్‌సీ) పెద్ద‌ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేప‌థ్యంలో ఆమె వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తూ కాన్పూర్‌లో మార్కెట్ల‌ను బంద్ చేయాల‌ని పిలుపునిచ్చారు. ఈ క్ర‌మంలో ముస్లిం వర్గానికి చెందిన కొందరు దుకాణాలు బంద్ చేసేందుకు ప్రయత్నిస్తున్న స‌మ‌యంలో వాగ్వాదం జరగడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు రోడ్డుపైకి వచ్చారు.

ఈ క్రమం రెండు వ‌ర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. కొంత మంది పోలీసులు వాళ్ల‌ను అడ్డుకునే ప్ర‌య‌త్నం చేసినా గొడ‌వ స‌ద్దుమ‌ణ‌గ‌లేదు. 10 నిమిషాల వ్య‌వ‌ధిలోనే అద‌న‌పు బ‌ల‌గాలు అక్క‌డ‌కు చేరుకున్నాయి. కానీ అప్ప‌టికే జ‌ర‌గాల్సిన భారీ నష్టం జ‌రిగిపోయింది. హింస సమయంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాన్పూర్‌లో ఉన్నారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై దాడికి దిగాయి.

నుపుర్ శర్మ తలకు కోటి రూపాయల రివార్డు 

ఇదిలాఉంటే.. బీజేపీ ప్ర‌తినిధి నుపుర్ శర్మ తలకు కోటి రూపాయల రివార్డు ప్ర‌క‌టించాయి ముస్లీం సంఘాలు. మహ్మద్ ప్రవర్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు ద్వారా ముస్లిం మనోభావాలను నుపుర్ శర్మ కించపరిచారంటూ ఆమెపై ఇప్పటికే కేసు నమోదైంది.