కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో సమిష్టిగా పోరాడాలని ప్రతిపక్ష కాంగ్రెస్ నిర్ణయించుకున్నప్పటి నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థి పై క్లారిటీ లేదు. ఎలాంటి వ్యాక్యలు చేయరాదని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశించినట్టు తెలుస్తోంది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కు రంగం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో అభ్యర్థుల భవితవ్యం బయటపడనున్నది. ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మొత్తం 36 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరగనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం ఒకటి, రెండింటి వరకు కర్ణాటక ఫలితాలు తేలనున్నాయి. ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారనే విషయం తెలుస్తుంది.
అయితే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. కర్ణాటకలో మరోసారి హంగ్ ఏర్పడే అవకాశముందని భావిస్తున్నారు. బీజేపీ కన్న కాంగ్రెస్ ఎక్కువ స్థానాల్లో విజయం సాధించినా.. మ్యాజిక్ ఫిగర్ (113) చేరుకునే అవకాశం లేవనే చెబుతున్నాయి. ఇదిలాఉంటే.. గెలుపుపై కాంగ్రెస్ చాలా ధీమాగా ఉంది. తాము 140 కన్నా ఎక్కువ స్థానాల్లో గెలుపు బావుటను ఎగరవేస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తుంది. ఇక బీజేపీ విషయానికి వస్తే.. ఎలాగైనా తాము మరోసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకుంటామని చెబుతోంది. ఇక జేడీయూ .. కింగ్ మేకర్ గా మారుతుందని భావిస్తున్న వేళ.. తాము కింగ్ మేకర్ కాదనీ, తామే కింగులమని ఆ పార్టీ నేతలు చెప్పుతున్నారు.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. పీసీసీ చీఫ్ డీకే శివకుమార్, సిద్ధరామయ్యల మధ్య సీఎం అభ్యర్థి ఎవరనేదానిపై అంతా ఆసక్తి నెలకొంది. అంతే కాదు.. నూతన అభ్యర్థికి అవకాశం కల్పిస్తారనే చర్చ కూడా సాగుతోంది. అయితే.. ఫలితాల విడుదల పూర్తి అయ్యేవరకు సీఎం అభ్యర్థి ఎవరనే విషయంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదనీ, ఇటు డీకే శివకుమార్ కు, అటు సిద్ధరామయ్యకు అధిష్టానం సూచించిందట. ఇప్పటికే పలుమార్లు వీరిద్దరితో ఏఐసీసీ నేత రణదీప్ సింగ్ సూర్జేవాలా సమావేశమైనట్టు తెలుస్తోంది. ఈ సమాచారంలో గెలుపొందిన అభ్యర్థులను
కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే బీజేపీ కూడా వరస సమావేశాలను నిర్వహిస్తోంది. ఇప్పటికే యడియూరప్ప, సీఎం బసవరాజ్ బొమ్మై, కీలక నేతలు సమావేశం అయ్యారు.
