Asianet News TeluguAsianet News Telugu

రూ.2కోట్లు ఇవ్వాల్సిందే.. ఆఫీసు కూల్చివేతపై కంగనా డిమాండ్

కంగన కార్యాలయాన్ని శివసేన సర్కార్ కూల్చివేస్తుండగా.. కంగన హైకోర్టును ఆశ్రయించడంతో స్టే లభించింది. ఈ క్రమంలోనే కంగన ముంబై కార్పొరేషన్ చర్యపై గతంలో వేసిన పిటీషన్ ను సవరించుకున్నట్టు కోర్టుకు విజ్ఞప్తి చేసింది.
 

Kangana Ranaut seeks rs.2crore Damages For Demolition At Mumbai Office
Author
Hyderabad, First Published Sep 16, 2020, 8:10 AM IST

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్... మహారాష్ట్ర సర్కార్ తో వార్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ఇటీవల ముంబయి కార్పోరేషన్ అధికారులు.. కంగనాకు చెందిన మణికర్ణిక భవనం( ఆమె కార్యాలయం) కొంత భాగం కూల్చి వేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఆ చర్య చట్టవిరుద్ధమని పేర్కొంటూ కంగనా తాజాగా రూ.2కోట్లు చెల్లించాలని డిమాండ్ చేస్తోంది.

బంద్రాలోని కంగనా రనౌత్ భవనం అక్రమంగా నిర్మించారంటూ  దానిని ముంబయి కార్పొరేషన్ కూల్చివేసింది. బాలీవుడ్ నటుడు సుశాంత్ మరణం కేసు, డ్రగ్స్ వ్యవహారంలో కంగనా శివసేన ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించింది. దీంతో.. దానికి బదులుగా భవనాన్ని కూల్చివేశారు.

ఇదిలా ఉండగా.. కంగన కార్యాలయాన్ని శివసేన సర్కార్ కూల్చివేస్తుండగా.. కంగన హైకోర్టును ఆశ్రయించడంతో స్టే లభించింది. ఈ క్రమంలోనే కంగన ముంబై కార్పొరేషన్ చర్యపై గతంలో వేసిన పిటీషన్ ను సవరించుకున్నట్టు కోర్టుకు విజ్ఞప్తి చేసింది.

తనకు బీఎంసీ రూ.2 కోట్లు చెల్లించాల్సిందేనని సవరణ పిటీషన్ లో ఆమె కోరారు. తన బంగ్లా లోని 40శాతాన్ని బీఎంసీ కూల్చేసినట్లు ఆమె క్లెయిమ్ చేశారు. ఈ పిటీషన్ పై ముంబై హైకోర్టు వచ్చేవారంలో వాదనలు వింటుంది. దీంతో బంగ్లాలో తాము కూల్చివేసిన భాగం అనధికారికమైనది బీఎంసీ రుజువు చేయాల్సి ఉంటుంది. అలా చేయలేని పక్షంలో కోర్టు ఉత్తర్వులకు లోబడి కంగనకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది.

Follow Us:
Download App:
  • android
  • ios