మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై `నువ్వు వారసత్వాన్ని అడ్డుపెట్టుకుని వచ్చిన చెత్త ప్రొడక్ట్‌వి` అంటూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ మరోసారి విరుచుకుపడింది. ప్రధానంగా వారి సొంత రాష్ట్రంలో తిండికి గతిలేనవారు ముంబైకి డబ్బు సంపాదించుకుని, నమ్మక ద్రోహానికి పాల్పడుతున్నారన్న ఉద్ధవ్ వ్యాఖ్యలపై ఆమె ఫైర్ అయ్యారు. 

ఈ వ్యాఖ్యలపై కంగన స్పందిస్తూ... `ఉద్ధవ్ నన్ను నమ్మక ద్రోహి అన్నారు. ముంబై నాకు షెల్టర్ ఇవ్వకపోతే నా రాష్ట్రంలో నాకు తిండి కూడా దొరకదని అన్నారు. నాకు మీ కొడుకు వయసుంటుంది. స్వయం ప్రతిభతో ఎదిగిన ఒంటరి మహిళ గురించి ఇలా మాట్లాడిన మిమ్మల్ని చూస్తుంటే సిగ్గు వేస్తోంది. ముఖ్యమంత్రి గారూ.. మీరు ఓ చెత్త నెపోటిజమ్ ప్రొడక్ట్` అని ట్వీట్ చేసింది. 

అనంతరం.. `సీఎంగారూ.. మీలా తండ్రి అధికారం, డబ్బు అడ్డుపెట్టుకునే తాగుబోతును కాదు. నేను వారసత్వాన్ని నమ్ముకుని ఉంటే హిమాచల్ ప్రదేశ్‌లోనే ఉండేదాన్ని. నేను కూడా ఓ ఘనమైన వారసత్వం ఉన్న కుటుంబం నుంచే వచ్చాను. కానీ, నేను ఆ వారసత్వం మీద, సంపద మీద ఆధారపడదలచుకోలేదు. కొంతమందికి ఆత్మగౌరవం, స్వీయ విలువ ఉంటాయ`ని కంగన ట్వీట్ చేసింది.  

ఇకనైనా అసభ్యకర ప్రసంగాలు కట్టిపెట్టాలని కంగనా సీఎంపై మండిపడ్డారు. అలాగే గతంలో సంజయ్ రౌత్ హరాం ఖోర్ అన్నారు.. ఇపుడు ఉద్ధవ్ నమక్ హరాం అంటున్నారంటూ కంగనా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా గతంలో ముంబై మున్సిపల్ అధికారులు తన ఇంటి కూల్చివేతపై సందర్బంగా నా ఇంటిలానే… త్వరలో ఉద్ధవ్  అహంకారం కూలి పోతుందంటూ మహా సీఎంపై కంగనా మండిపడిన సంగతి తెలిసిందే.