Asianet News TeluguAsianet News Telugu

దళిత మహిళపై దాడి.. వీడియో షేర్ చేసిన మాజీ సీఎం

ఊడిపోతున్న తన పంచెను సరిచేసుకుంటూ మరీ ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఆ సమయంలో బాధితురాలి కుమార్తె... తన తల్లిని విడిచిపెట్టాలంటూ గట్టిగా కేకలు పెట్టింది. అయినప్పటికీ వాళ్లు వినిపించుకోలేదు

Kamal Nath Tweets Video, Alleges Madhya Pradesh BJP Leaders Thrashed Woman
Author
Hyderabad, First Published Aug 22, 2020, 10:31 AM IST

దళిత మహిళపై కొందరు నేతలు దాడికి పాల్పడ్డారు. కాగా.. ఆ దాడికి పాల్పడినవారంతా బీజేపీ నేతలేనని.. మహిళ అని కూడా చూడకుండా దారుణంగా ప్రవర్తించారంటూ మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత కమలనాథ్ ఆరోపించారు. ఆ దాడికి సంబంధించిన వీడియోని కూడా ఆయన షేర్ చేయడం గమనార్హం.

బీజేపీ ప్రభుత్వ హయాంలో ఆడపడుచులకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. కమల్‌నాథ్‌ పోస్ట్‌ చేసిన వీడియోలో ఓ మహిళపై ఓ వ్యక్తి దాడికి దిగాడు. ఆమెను నెట్టేస్తూ తీవ్రంగా కొట్టాడు. ఊడిపోతున్న తన పంచెను సరిచేసుకుంటూ మరీ ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఆ సమయంలో బాధితురాలి కుమార్తె... తన తల్లిని విడిచిపెట్టాలంటూ గట్టిగా కేకలు పెట్టింది. అయినప్పటికీ వాళ్లు వినిపించుకోలేదు

ఈవీడియోను కమల్‌నాథ్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘బేతుల్ జిల్లాలోని శోభాపూర్ లో బీజేపీ నాయకులపై నిరసన వ్యక్తం చేసినందుకు ఒక దళిత మహిళ, ఆమె కుమార్తెపై ఆ పార్టీ నాయకులు బహిరంగంగా దాడి చేశారని హిందీలో ట్వీట్‌ చేశారు.  దళిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసినా ఆ నాయకులపై చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. పైగా దాడికి పాల్పడిన నేతలకు పోలీసులు అండగా నిలిచారని ఆరోపించారు.

 

నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ‘శివరాజ్‌ జీ, మీ ప్రభుత్వంలో సోదరీమణులకు తరచూ ఇలాంటి సంఘటనలు ఎదురవుతున్నాయి. పోలీసులు నిందితులకు రక్షణ కల్పిస్తున్నారు. తక్షణమే వారిపై చర్యలు తీసుకొని సదరు మహిళలకు, ఆమె కుమార్తెకు న్యాయం చేయాలి’అని ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ను కమల్‌నాథ్‌ డిమాండ్‌ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios