వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు సినీనటుడు, మక్కల్ నీధి మయ్యం అధినేత కమల్ హాసన్. శనివారం చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. భావసారూప్యత కలిగిన పార్టీలతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తామని వెల్లడించారు కమల్

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు సినీనటుడు, మక్కల్ నీధి మయ్యం అధినేత కమల్ హాసన్. శనివారం చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. భావసారూప్యత కలిగిన పార్టీలతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తామని వెల్లడించారు కమల్. రంగులు మార్చే పార్టీలతో కలవనని, తమిళనాడు అభివృద్ధే తమ లక్ష్యమని తెలిపారు.

20 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగినా తమ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు. పొత్తు నిర్ణయాలను పూర్తిగా కమల్‌కు ఇస్తూ మక్కల్ నీధి మయ్యం పార్టీ ఏకగ్రీవంగా తీర్మానించింది. తమిళనాడు రాజకీయాల్లో మార్పు కోరుకుంటున్నామని.. తమతో కలిసి వచ్చే పక్షాలను స్వాగతిస్తామని కమల్ హాసన్ పేర్కొన్నారు.