రాజకీయాలపై రజనీకాంత్, కమల్ హాసన్ లకు చిరంజీవి ఒక తమిళ ఇంటర్వ్యూ లో సరదాగా  సలహాలిచ్చారు.  వారు రాజకీయాల్లోకి రాకుండా ఉంటేనే బాగుంటుందని అన్నాడు. 

ఈ విషయమై కమల్ హాసన్ స్పందించారు. చిరంజీవికి కౌంటర్ ఇస్తూ తాను గెలుపోటములను దృష్టిలో ఉంచుకొని రాజకీయాల్లోకి రాలేదని కౌంటర్ ఇచ్చారు. ఒక మార్పు కోసం, ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి వచ్చానని అన్నారు. చిరంజీవి తనకెప్పుడూ రాజకీయాలకు సంబంధించిన సలహాలివ్వలేదని ఆయన తెలిపారు. 

 
లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల ప్రజల ఆలోచనాధోరణి ఎలా ఉంటుందో తెలిసిందన్నారు. తనకు, తమ పార్టీకి ఎన్నికల్లో ప్రజలు ఏ ఏ అంశాలను గురించి ఆలోచించి ఓటు వేస్తారో తెలుసుకునే అవగాహనా కార్యక్రమం లాగా ఈ లోక్ సభ ఎన్నికలు  ఉపయోగపడ్డాయన్నారు.
 
తమిళ పత్రిక ఆనంద వికటన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో చిరంజీవి రజనీకాంత్, కమల్ హాసన్ లకు  ఈ సలహా ఇచ్చారు. సున్నిత మనస్కులు ప్రస్తుత రాజకీయాల్లో మనలేరని, డబ్బు మాత్రమే రాజకీయాలను శాసించే స్థాయికి రాజకీయాలు దిగజారాయని చిరంజీవి ఆ ఇంటర్వ్యూ లో తెలిపారు.