Ayodhya: రామ మందిరంపై కమల్ హాసన్ రియాక్షన్ ఇదే..

రామ మందిరం ప్రారంభంపై కమల్ హాసన్ స్పందించారు. తాను 30 ఏళ్ల క్రితం వెల్లడించిన అభిప్రాయంతోనే ఇప్పటికీ ఉన్నానని వివరించారు.
 

kamal haasan reacts on ram mandhir opening kms

Kamal Haasan: అయోధ్యలో 22వ తేదీన రామ మందిరాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి చాలా మంది ప్రముఖులు హాజరయ్యారు. హేతుబద్ధంగా మాట్లాడే కమల్ హాసన్ కూడా ఈ రామ మందిరంపై స్పందించారు. ఆయన ఏమన్నారో తెలుసుకోండి.

ఇండియన్ 2 సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న సమయంలో ఆయన నిన్న సాయంత్రం పార్టీ క్యాడర్‌తో సమావేశం అయ్యారు. మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల కోసం తాము చర్చించినట్టు వివరించారు. ఏమైనా న్యూస్ ఉంటే తానే స్వయంగా వెల్లడిస్తానని తెలిపారు. అదే సమయంలో రామ మందిరం ప్రారంభంపై ఆయనను ప్రశ్నించగా.. తాను దాని గురించి ఇది వరకే చెప్పానని, 30 ఏళ్ల కిందే తన అభిప్రాయాన్ని చెప్పానని వివరించారు. 30 ఏళ్ల క్రితం నాటి అభిప్రాయంతోనే తాను ఇప్పటికీ ఉన్నాని చెప్పారు.

1991లో అయోధ్యలో బాబ్రీ మసీదు కారణంగా జరిగిన అల్లర్ల సమయంలో కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అక్కడ రామ మందిరం ఉన్నా.. బాబ్రీ మసీదు ఉన్నా తేడా లేదని వివరించారు. మతపరమైన విభేదాలు లేని ప్రజలపైనే తన విశ్వాసం అని తెలిపారు. ఆయన తన ‘హే రామ్’ సినిమాలోని ‘రామర్ ఆనలం బాబర్ ఆనలం’ అనే పాటలో ఇదే విషయాన్ని నొక్కి వక్కాణించారు.

Also Read : Election: ఏప్రిల్ 16 నుంచి లోక్ సభ ఎన్నికలు? ఎన్నికల సంఘం ఏమన్నదంటే?

రామ మందిరం ప్రారంభంపై కమల్ హాసన్ స్పష్టమైన అభిప్రాయాన్ని వెల్లడించలేదు. అయితే, మతపరమైన విభేదాలు లేని స్థితిని తాను పేర్కొన్నాడని అర్థం చేసుకోవచ్చు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios