తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు ప్రముఖ హీరో కమల్ హాసన్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. గెలుపుకోసం తీవ్రంగా శ్రమించినా చివరకు ఆయనకు ఓటమి తప్పలేదు. కోయంబత్తూరు సౌత్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సమీప ప్రత్యర్థి వాసతి శ్రీనివాసన్ (బీజేపీ) మీద 1300 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో ఓడిపోయారు.

కమల్ హాసన్ పార్టీ మరికొన్ని పార్టీలతో కలిసి మూడో కూటమికి ఏర్పడిన సంగతి తెలిసిందే. మూడో కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా కమలహాసన్ ప్రకటించుకున్నారు. అయితే చివరకు ఆయన ఓటమి అభిమానులను షాక్ కు గురిచేసింది. అంతేకాకుండా ఆయనతో పాటు ఆయన పార్టీకి చెందిన వారు 142 స్థానాల్లో పోటీ చేయగా వారందరూ ఓడిపోయారు. తొలి ఎన్నికల్లోనే ఓటమి పాలవడంపై ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

డీఎంకే ఘన విజయంపై స్టాలిన్ కామెంట్స్..!...

తాజాగా ఈ విషయంపై కమల్ కూతురు హీరోయిన్ శృతి హాసన్ స్పందించారు. ‘మిమ్మల్ని చూస్తుంటే ఎప్పటికి గర్వంగానే ఉంటుంది నాన్నా(అప్పా)’ అంటూ ఇంస్టాగ్రామ్ స్టోరీ లో తన తండ్రి ఫోటోలు షేర్ చేసింది. అంతేకాకుండా తన తండ్రిని ఫైటర్ అంటూ అభివర్ణిస్తూ ద ఫైటర్‌ అనే  హ్యాష్ ట్యాగ్ తో పోస్ట్ చేసింది. శృతి హాసన్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ‘గెలుపోటములు సహజం.. ప్రతి కూతురికి తన తండ్రి ఎప్పటికీ హీరోనే’ అంటూ పలువురు నెటిజన్లు పేర్కొన్నారు.

కాగా, తమిళనాడు రాష్ట్రంలో 10 ఏళ్ల తర్వాత డిఎంకె అధికారంలోకి రానుంది. కరుణానిధి లేకున్నా కూడ పార్టీని  స్టాలిన్ విజయతీరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించారు. గతంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టుండేది కానీ ఆ తర్వాత ద్రవిడ పార్టీల ఆధిపత్యంలోకి ఈ రాష్ట్రం వెళ్లింది. డిఎంకె లేదా అన్నాడిఎంకె పార్టీలతోనే జాతీయ పార్టీలు కూడ పొత్తులు పెట్టుకోవాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి.

తమిళనాడు: పదేళ్ల తర్వాత అధికారంలోకి డిఎంకె...

1952 నుండి 1962 వరకు తమిళనాడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 1967లో తొలిసారిగా డిఎంకె అధికారాన్ని చేపట్టింది.  ఆ తర్వాత 1971లో జరిగిన ఎన్నికల్లో కూడ అదే పార్టీ విజయం సాధించింది. డిఎంకె నుండి చీలిపోయి అన్నాడిఎంకెను  ఎంజీ రామచంద్రన్ ఏర్పాటు చేశారు. 1977లో అన్నాడిఎంకె తొలిసారిగా అధికారాన్ని చేపట్టింది. 1980లో కూడ ఆ పార్టీ తిరిగి అధికారాన్ని కైవసం చేసుకొంది. 

1984లో కూడ అదే పార్టీ విజయం సాధించింది. 1989లో డిఎంకె అధికారాన్ని చేపట్టింది. 1991 ఎన్నికల్లో అన్నాడిఎంకె గెలుపొందింది. 1996 ఎన్నికల్లో డిఎంకె గెలిచింది. 2001లో అన్నాడిఎంకె విజయం సాధించింది. 2006లో డిఎంకె గెలిచింది. 

2011,2016 ఎన్నికల్లో అన్నాడిఎంకె గెలుపొందింది.2021 ఎన్నికల్లో డిఎంకె విజయం సాధించింది. పదేళ్ల తర్వాత తమిళనాడు రాష్ట్రంలో డిఎంకె విజయం సాధించింది.