అయోధ్య రామ మందిరం: ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరుకానున్న నిత్యానంద
అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి తనకు ఆహ్వానం అందిందని స్వయం ప్రకటిత దేవుడిగా ప్రకటించిన నిత్యానంద ప్రకటించారు.
న్యూఢిల్లీ: అయోధ్యలో రామ మందిరంలో రాముడి విగ్రహా ప్రాణ ప్రతిష్ట వేడుకకు తనకు కూడ ఆహ్వానం అందిందని స్వయం ప్రకటిత దేవుడిగా ప్రకటించిన నిత్యానంద ఆదివారం నాడు ప్రకటించారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస పాలకుడిగా నిత్యానంద ప్రకటించుకున్న విషయం తెలిసిందే.
అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి మరో రెండు రోజులు. ఈ చారిత్రాత్మకమైన అసాధారణ దృశ్యాన్ని మిస్ అవ్వకండని ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ లో ఆయన పోస్టు చేశారు.
నిత్యానంద తనను తాను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస పాలకుడిగా ప్రకటించుకున్న విషయం తెలిసిందే. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాసంలోని పలు ఆలయాల్లో నిర్వహించే కార్యక్రమాలకు సంబంధించిన షెడ్యూల్ ను కూడ సోషల్ మీడియాలో ఆయన ప్రకటించారు.ఈ కార్యక్రమాలను తమ అధికారిక యూట్యూబ్ చానెల్ లో వీక్షించవచ్చని నిత్యానంద ప్రకటించారు.
అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొని 2019లో భారత దేశం నుండి నిత్యానంద పారిపోయాడు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస స్థాపకుడిగా ఆయన చెప్పుకున్నారు. ఈక్వెడార్ లోని తీరంలో ఒక ద్వీపాని కొనుగోలు చేసి దానికి కైలాస అని పేరు పెట్టారని నివేదికలు చెబుతున్నాయి. ఈ ద్వీపం హిందూ ప్రజలకు పవిత్ర స్థలంగా పేర్కొన్నారు.
దేశంలోని ట్రెజరీ, వాణిజ్యం, సార్వభౌమాధికారం, హౌసింగ్, హ్యుమన్ సర్వీసెస్ వంటి మరిన్ని పరిపాలన కోసం అనేక విభాగాలున్నాయని నివేదికలు సూచిస్తున్నాయి. కైలాస ప్రభుత్వంలోని ఈ- వీసాలు, లేదా ఈ -పౌరసత్వం కోసం ధరఖాస్తులను ఆహ్వానిస్తుంది.పరాగ్వే ప్రభుత్వ అధికారి కైలాస ప్రతినిధులతో ఒక మెమారాండంపై సంతకం చేయడంతో అతడిని మార్చివేశారనే విషయం కూడ ప్రచారంలోకి వచ్చింది.