తన వద్ద శిక్షణ తీసుకుంటున్న మైనర్ క్రీడాకారిణీని లైంగికంగా వేధించిన కేసులో సస్పెన్షన్‌కు గురై.. తీవ్రమనస్తాపంతో కోచ్ ఆత్మహత్య చేసుకున్నాడు. బెంగళూరులోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా శిక్షణా కేంద్రంలో రుద్రప్ప హోషమణి కబడ్డీ కోచ్‌గా పనిచేస్తున్నాడు. 

ఈ క్రమంలో తన వద్ద శిక్షణకు వచ్చిన 13 ఏళ్ల బాలిక ఓ రోజు బట్టలు మార్చుకునేందుకు తన గదిలోకి వెళ్లింది.. దీనిని పసిగట్టిన కోచ్.. ఆమె వెనకే గదికి వెళ్లి లైంగిక దాడి చేయబోయాడు. దీంతో బాలిక జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది.

ఆమె తల్లిదండ్రులు కోచ్‌పై లైంగిక వేధింపుల కేసు పెట్టారు. చివరికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా విచారణలోనూ అతనిపై ఆరోపణలు నిజమేనని తేలడంతో హోషమణిని సస్పెండ్ చేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

జరిగిన సంఘటనపై తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన హరిహరటౌన్ ప్రాంతంలోని హోటల్ గదికి వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు. హోటల్ గది నుంచి వాసన రావడంతో సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో.. వారు తలుపులు పగలగొట్టి చూడగా హోషమణి సీలింగ్‌కు వేలాడుతూ కనిపించాడు.

మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి.. సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. జరిగిన సంఘటన, తనపై కేసు ఆవేదన కలిగించిందని.. తనను క్షమించాలని భార్య, కుమారులను ఉద్దేశిస్తూ లేఖలో పేర్కొన్నాడు.