మైనర్ బాలిక అనే జాలి  కూడా లేదు. ఒకరి తర్వాత మరొకరు ఆమెపై కామ వాంఛ తీర్చుకున్నారు. ఇలా ఒక్కసారి కాదు.. పలుమార్లు తమ కామ వాంఛ తీర్చుకోవడానికి బాలికను వస్తువులా వాడుకున్నారు. చివరకు బాలిక గర్భవతి కావడంతో... అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... కర్ణాటక రాష్ట్రం దక్షిణ కన్నడ జిల్లా విఠల్ గ్రామానికి చెందిన మైనర్ బాలిక ఇటీవల పదో తరగతి పూర్తి చేసింది. అప్పటి నుంచి ఇంట్లోనే ఉంటోంది. ఆమెపై గ్రామానికి చెందిన ఐదుగురు కన్నేశారు. వారిలో ఒకరు గ్రామ పంచాయతీ కార్యదర్శి కావడం గమనార్హం. వారంతా కలిసి బాలికను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశారు. ఒకరి తర్వాత మరొకరు వరసగా ఐదుగురు సామూహికంగా ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.

ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బెదిరించారు. కాగా.. బాలిక ప్రస్తుతం గర్భవతి. ఆమెకు ఆరు నెలలు నిండిన తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లిదండ్రులు ఈ విషయంపై ఆరా తీయగా... అసలు విషయం బయటపడింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. నిందితులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.