Karnataka: క‌ర్నాట‌క‌లో కాంట్రాక్ట‌ర్ సంతోష్ పాటిల్ ఆత్మ‌హ‌త్య కేసులో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి కేఎస్ ఈశ్వ‌ర‌ప్ప‌పై కేసు న‌మోదైంది. ఆయ‌న‌ను వెంట‌నే మంత్రివ‌ర్గం నుంచి తొల‌గించి.. అరెస్టు చేయాల‌ని రాష్ట్ర ప్ర‌తిప‌క్షాలు డిమాండ్ చేస్తున్నాయి.  

Karnataka : మంత్రి కేఎస్ ఈశ్వరప్పను రాష్ట్ర మంత్రివర్గం నుంచి బహిష్కరించాలని, అలాగే కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ మృతిపై అరెస్ట్ చేయాలని క‌ర్నాట‌క రాష్ట్ర ప్ర‌తిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్ డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలోని కర్నాట‌క‌ కాంగ్రెస్ ప్రతినిధి బృందం బుధవారం గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్‌ను కలిశారు. కాంట్రాక్ట‌ర్ సంతోష్ పాటిల్ ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణ‌మైన మంత్రి కేఎస్ ఈశ్వ‌ర‌ప్ప‌, అత‌ని అనుచ‌రుల‌ను పోలీసులు అరెస్టు చేసేలా ఆదేశాలు జారీ చేయాల‌నీ, పోలీసుల‌కు ఈ కేసు విచార‌ణ‌లో ఒత్తిడి రాకుండా చూసుకోవాల‌ని డిమాండ్ చేస్తూ.. గ‌మ‌ర్న‌ర్ కు విన‌తి ప‌త్రం అందించారు. కర్నాట‌క గవర్నర్‌కు సమర్పించిన మెమోరాండంలో కాంగ్రెస్ ప్రతినిధి బృందం.. తన మరణానికి మంత్రి కేఎస్ ఈశ్వ‌ర‌ప్ప కార‌ణ‌మంటూ మృతుడు పంపిన సుసైడ్ నోట్ ను సోషల్ మీడియా ద్వారా సందేశం పంపారని పేర్కొన్నారు.

ఐపీసీ సెక్షన్-306, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్-13, ఇతర చట్ట నిబంధనల ప్రకారం శిక్షార్హమైన క్రిమినల్ కేసును వెంటనే నమోదు చేయాలని మెమోరాండంలో డిమాండ్ చేశారు. న్యాయం, సమన్యాయం దృష్ట్యా మంత్రిని అరెస్టు చేయాలని నేతలు డిమాండ్‌ చేశారు. "కేఎస్ ఈశ్వరప్పను బర్తరఫ్ చేయాలనీ, అరెస్ట్ చేయాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశాం...రెండవది, కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్‌తో సహా (తర్వాత ఆత్మహత్యతో మరణించిన) తన సొంత వ్యక్తుల నుంచి 40% కమీషన్ తీసుకుంటానని ఆయనపై అవినీతి కేసు నమోదు చేయాలి" అని కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ అన్నారు. ఈ విష‌యంపై సంబంధిత అధికారుల‌తో మాట్లాడుతాన‌ని గ‌వ‌ర్న‌ర్ థావర్ చంద్ గెహ్లాట్ చెప్పార‌ని డీకే పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై త్వరితగతిన, పారదర్శకంగా విచారణ జరిగేలా చూడాలని పోలీసులను ఆదేశించినట్లు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఇదివ‌ర‌కే తెలిపారు.

Scroll to load tweet…

కాగా, క‌ర్నాట‌క‌లో కాంట్రాక్ట‌ర్ సంతోష్ పాటిల్ ఆత్మ‌హ‌త్య కేసులో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి కేఎస్ ఈశ్వ‌ర‌ప్ప‌తో పాటు ఆయన అనుచరులు బసవరాజ్, రమేష్‌లపై కేసు నమోదైంది. మంత్రి 40 శాతం క‌మీష‌న్ డిమాండ్ చేశారంటూ త‌న సూసైడ్‌లో లేఖ‌లో సంతోష్ పాటిల్ పేర్కొన్న విష‌యం తెలిసిందే. ఈ ఆత్మ‌హ‌త్య కేసు ద‌ర్యాప్తును పోలీసులు వేగ‌వంతం చేశారు. మంత్రి ఈశ్వ‌ర‌ప్ప త‌న‌పై ఒత్తిడి తీసుకువ‌చ్చార‌నీ, 40 శాతం క‌మీష‌న్ డిమాండ్ చేశారంటూ త‌న సూసైడ్‌లో లేఖ‌లో సంతోష్ పాటిల్ పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలో సంతోష్ పాటిల్ సోద‌రుడి ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఎఫ్ఐఆర్‌లో మంత్రి ఈశ్వ‌ర‌ప్ప‌తో పాటు ఆయ‌న మ‌ద్ద‌తుదారులు బ‌స‌వ‌రాజ్, ర‌మేశ్ పేర్ల‌ను కూడా చేర్చారు. అయితే ఈ కేసును పార‌ద‌ర్శ‌కంగా ద‌ర్యాప్తు చేయాల‌ని పోలీసుల‌ను క‌ర్నాట‌క ముఖ్య‌మంత్రి బ‌స‌వ‌రాజ్ బొమ్మై ఆదేశించారు.