హైదరాబాద్ షాద్‌నగర్‌లో దిశపై జరిగిన అత్యాచారం, హత్య ఘటనల నేపథ్యంలో మహిళల రక్షణకు కొత్త చట్టాలను చేయాలని, అలాగే తమను తాము రక్షించుకునేందుకు ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్ వంటి శిక్షణ ఇవ్వాల్సిందిగా కొందరు డిమాండ్ చేస్తున్నారు.

ఈ క్రమంలో బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళల రక్షణ కోసం నిబంధనలు మార్పు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం మహిళలు రక్షణ కోసం ఉపయోగించే పెప్పర్ స్ప్రేలను కూడా మెట్రో స్టేషన్‌లోకి అనుమతించనుంది.

Also Read:జస్టిస్ ఫర్ దిశ: ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటుకు హైకోర్టుకు లేఖ

లైంగిక దాడులు, వేధింపులను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. గతంలో మెట్రో స్టేషన్‌లోని చెక్ పాయింట్ వద్ద తనిఖీలు చేసి మహిళల నంచి వీటిని తీసుకుని పక్కన పడేసేవారు. ఇప్పుడు ఇలాంటి పరిస్ధితి లేదు.

మెట్రోలో టెక్నికల్ అంశాలు పరిశీలిస్తే పెప్పర్ స్ప్రేతో పాటు నిప్పు వ్యాప్తి చేసే పదార్ధాలను అనుమతించరు. పెప్పర్ స్ప్రేల వల్ల మంటలు త్వరగా వ్యాపించే అవకాశం ఉంది. దీనిని ప్రమాదంగా భావించిన మెట్రో అధికారులు అలాంటి వాటిని నిషేధించారు.

Also Read:‘దిశ’ను బతికుండగానే కాల్చారు... జైల్లో ప్రధాన నిందితుడు

అయితే దిశ ఘటన నేపథ్యంలో మహిళలు తమ వెంట పెప్పర్ స్ప్రేలు తమ వెంట తీసుకెళ్లొచ్చని నమ్మ మెట్రో ఆదేశాలు జారీ చేసింది. దీనితో పాటు మహిళల కోసం ప్రతిక్షణం నిఘా ఉంటుందని అధికారులు తెలిపారు.