మన చుట్టూ మందుబాబులు చాలా మందే ఉంటారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా సీసాలు సీసాలు లాగించేస్తారు. అంత తాగి కూడా.. ఎంత తాగినా కిక్కు ఎక్కడం లేదంటూ బిల్డప్ కొడుతుంటారు. నిజంగానే.. కిక్కు ఎక్కుతుందా లేదా అనే విషయంపై  ఓ సంస్థ పరిశోధన చేయగా.. షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి.

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ - నాసా నేతృత్వంలో జరిగిన ఈ పరిశోధనలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఈ ఫలితాల ప్రకారం, మందు భారీగా తాగాల్సిన అవసరం కూడా లేకుండా.. కేవలం సగం బీరు తాగినా సరే కంటికి, చేతికి సమన్వయ లోపం వచ్చేస్తుందని తేలింది. 

‘‘ఓ 75 కేజీల బరువుండే వ్యక్తి.. సగం బీరు తాగితే చాలు. అతనికి మత్తు ఎక్కేస్తుంది. కంటికి, చేతికి సమన్వయం దెబ్బతింటుంది’’ అని నాసా పరిశోధనలో తేలింది. దీనిలో భాగంగా మందు తాగడానికి ముందు, తాగిన తర్వాత వ్యక్తుల్లో వచ్చిన తేడాలని పరిశోధకులు గమనించారు. అప్పుడే ఈ విషయం వెల్లడయ్యింది. అంటే సగం బీరు తాగిన వాళ్లు అయినా సరే డ్రైవింగ్ వంటి పనులు చేయడం ప్రమాదకరం అని నాసా పరిశోధకులు తేల్చారు.