భారతదేశ సున్నితమైన సమాచారాన్ని, రహస్య విషయాలను చైనాకు చేరవేస్తున్న కేసులో పోలీసులు మరో ముగ్గురిని అరెస్ట్ చేసారు. ఢిల్లీకి చెందిన ప్రముఖ జర్నలిస్ట్ రాజీవ్ శర్మ, ఒక చైనా మహిళా, ఆమెకు సహకరిస్తున్న మరో నేపాలీ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

చైనా గూఢచార, ఇంటలిజెన్స్ సంస్థలకు భారత దేశ రహస్య సమాచారాన్ని చేరవేసిన కేసులో రాజీవ్ శర్మను ఢిల్లీ పోలీసులు ప్రశ్నించారు. ఆతరువాత అతనిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుండి డబ్బులు, లాప్ టాప్, మొబైల్స్ లభ్యమయినట్టు తెలుస్తుంది. 

రాజీవ్జ శర్మ ర్నలిస్టు ముసుగులో భారతదేశ సమాచారాన్ని ఇతర చైనాకు చేరవేస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఈ సమాచారం చేరవేసిందనుకు చైనా మహిళ రాజీవ్ కి భారీమొత్తంలో డబ్బును అందిస్తుందని, ఇంకా విచారణ జరుగుతుందని పోలీసులు తెలిపారు. 

ఇంకా కేసు పూర్తిస్థాయి విచారణ పూర్తవలేదని, రానున్న రోజుల్లో కేసు విచారణ ముందుకు సాగుతుండగా మరిన్ని విషయాలు వెలుగుచూస్తాయని చెప్పారు పోలీసులు. రాజీవ్ శర్మకు ఆరు రోజుల పోలీస్ కస్టడీని మంజూరు చేసింది కోర్టు.