Asianet News TeluguAsianet News Telugu

శ్రీరామ మంత్ర పఠనానికి భక్తులకు ఆహ్వానం : వర్చువల్ గా ప్రారంభించిన జోష్ , డైలీ హంట్


అయోధ్యలోని రామ్ లల్లా విగ్రహా ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకొని పలు సంస్థలు వైవిధ్యమైన కార్యక్రమాలను చేపడుతున్నాయి. ఇందులో భాగంగానే జోష్ యాప్,  డైలీహంట్ లు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టాయి.

Josh and Dailyhunt unveil the Shri Ram Mantra Chant Room a digital initiative to embrace collective devotion lns
Author
First Published Jan 22, 2024, 11:12 AM IST | Last Updated Jan 22, 2024, 11:22 AM IST


న్యూఢిల్లీ: దేశంలోని ప్రముఖ  షార్ట్ వీడియో యాప్ జోష్,   డైలీ హంట్  అయోధ్యలో రాముడి విగ్రహా ప్రతిష్టాపనను పురస్కరించుకొని  వర్చువల్ గా  శ్రీరామ మంత్ర పఠన కార్యక్రమాన్ని ప్రారంభించింది. 

శ్రీరాముడి పట్ల భక్తిని దృష్టిలో ఉంచుకొని  ఆధ్యాత్మిక మంత్రాలను పఠించేందుకు  ఈ కార్యక్రమంలో పాల్గొనాలని  భక్తులను ఆహ్వానిస్తున్నారు నిర్వాహకులు.

శ్రీరామ్, జైరామ్, జైజైరామ్ అనే శ్రీరామ మంత్రాలను  వర్చువల్ గా భక్తులు  పఠించవచ్చు. అయితే  ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు  ఈ మంత్రాలను  11, 108, లేదా  1008 సార్లు పఠించవచ్చు. అయితే  ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి  రామనామ జపం చేసినట్టుగా ప్రమాణ పత్రాలను(ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టుగా సూచించే సర్టిఫికెట్)కూడ అందించనున్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు  నిర్వాహకులు  ఆహ్వానం పలికారు. జోష్ యాప్  వినియోగదారులు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు తమ కుటుంబ సభ్యులు,స్నేహితులను కూడా ఆహ్వానించవచ్చని నిర్వాహకులు తెలిపారు. 

డైలీ హంట్ లో అయోధ్యలో రామ మందిరంలో రాముడి విగ్రహా ప్రాణ ప్రతిష్టను  లైవ్ చూడవచ్చని నిర్వాహకులు తెలిపారు. అంతేకాదు  ఈ కార్యక్రమానికి సంబంధించిన ఆడియో అప్ డేట్ లు,పాడ్ క్యాస్టులను కూడ వినవచ్చని తెలిపారు. రాముడి చరిత్రతో పాటు  అయోధ్యకు సంబంధించిన అన్ని అంశాలను తెలుసుకొనే అవకాశం ఉందని నిర్వాహకులు ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో కనీసం ఒక్క మిలియన్ కంటే ఎక్కువ మందిని ఒకచోట చేర్చాలనే  లక్ష్యంతో  వెళ్తున్నట్టుగా నిర్వాహకులు తెలిపారు. జోష్ అనేది మేడిన్ ఇన్ ఇండియా షార్ట్ వీడియో యాప్,  2020లో  ఆగస్టులో దీన్ని ప్రారంభించారు. భారత దేశంలోని స్థానిక భాషలల్లో కంటెంట్ అందించే ఫ్లాట్ ఫారమ్ డైలీ హంట్.  ప్రతి రోజు 15 భాషల్లో  1 మిలియన్ కొత్త కంటెంట్ ను డైలీ హంట్ అందిస్తుంది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios