బీఆర్ఎస్‌తో జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించాలని భావించిన ఆ పార్టీ అధినేత కేసీఆర్ అందుకు తగ్గట్టుగానే అడుగులు వేస్తున్నారు. అయితే ఒడిశాలో బీఆర్ఎస్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి.
బీఆర్ఎస్‌తో జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించాలని భావించిన ఆ పార్టీ అధినేత కేసీఆర్ అందుకు తగ్గట్టుగానే అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలో పార్టీ విస్తరణపై దృష్టి సారించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, గుజరాత్.. వంటి కొన్ని రాష్ట్రాల నుంచి బీఆర్ఎస్‌లో పలువురు రాజకీయ నేతలు చేరుతున్నారు. అయితే ఒడిశాలో బీఆర్ఎస్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీలో చేరిన పలువురు ప్రముఖులు.. ఇప్పుడు వీడేందుకు సిద్దమవుతున్నారు. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ కుటుంబం.. కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్దమైంది.
అయితే ఇప్పుడు.. మాజీ ఎంపీ జయరామ్ పాంగి కాంగ్రెస్‌లో చేరడానికి ఆసక్తిగా ఉన్నారు. కాంగ్రెస్ జాతీయ నేతలతో టచ్‌లో ఉన్నానని, త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని పాంగి మీడియాకు తెలిపారు. ఒడిశాలో బీఆర్ఎష్ రాష్ట్ర విభాగాన్ని ప్రారంభించకూడదని ఆ పార్టీ నిర్ణయించుకున్నందున తాను కాంగ్రెస్‌లో చేరాలనుకుంటున్నట్లు చెప్పారు. తాను రాజీనామా చేసిన బీజేడీ లేదా బీజేపీలోకి తిరిగి రానని పాంగి చెప్పారు. ఇక, ఈ ఏడాది జనవరిలో గమాంగ్ కుటుంబ సభ్యులతో కలిసి పాంగి, మరికొందరు నేతలు హైదరాబాద్‌కు వచ్చి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరిన సంగతి తెలిసిందే.
జయరామ్ పాంగి.. 2009లో బీజేపీ టిక్కెట్‌పై కోరాపుట్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. అయితే ఆయన 2017 మే 9న బీజేడీకి రాజీనామా చేసి.. బీజేపీలో చేరారు. 2019 ఎన్నికల్లో కోరాపుట్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన జయరామ్ పాంగి విజయం సాధించలేకపోయారు.
