గురువారం ఉదయం భారత భూభాగంపైకి పాకిస్తాన్ విమానాలు వచ్చాయని భారత సైన్యం తెలిపింది. ఢిల్లీలో కేంద్ర భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీతో త్రివిధ దళాధిపతులు సమావేశమయ్యారు.

అనంతరం త్రివిధ దళాధిపతులు మీడియాతో సంయుక్త సమావేశం నిర్వహించారు. దాడి విషయంపై పాకిస్తాన్ పదే పదే మాట మార్చిందని, సరిహద్దుల్లో దొరికిన పాక్ ఎఫ్-16 యుద్ధ విమాన శకలాలను వారు మీడియాకు చూపారు.

* పాక్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన యుద్ధ విమానాలను భారత సైన్యం గుర్తించింది

* మిలటరి స్థావరాలను టార్గెట్ చేసి, దాడులకు ప్రయత్నించాయి

* పాక్ యుద్ధ విమానాల దాడులను తిప్పికొట్టాం

* భారత సైన్యం ఒక మిగ్-21ను కోల్పోయింది

* పాకిస్తాన్ అబద్ధాలు ప్రచారం చేస్తోంది 

* భారత్‌కు చెందిన రెండు యుద్ధ విమానాలను కూల్చేసామని చెప్పింది

* ఇద్దరు పైలట్లను బందీలుగా పట్టుకున్నామని మొదట చెప్పి, ఆ తర్వాత మాట మార్చింది

* ఎఫ్-16ను ఉపయోగించలేదని మొదట చెప్పింది

* అది కూడా అబద్ధమని తేలింది

* భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా దాడులు చేయలేదని మరో అబద్ధం చెప్పింది

* పాకిస్తాన్ ఎఫ్-16 యుద్ధ విమానాలను వాడిందని ఆధారాలున్నాయి

* పాక్‌కు చెందిన రెండు ఎఫ్-16 యుద్ధ విమానాలను కూల్చేశాం

* ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం

* ఫిబ్రవరి 26 కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ పదే పదే ఉల్లంఘిస్తోంది

* జల, వాయు, భూతల మార్గాల్లో త్రివిధ దళాలు పూర్తి సిద్ధంగా ఉన్నాయి

* పాక్ సైన్యం కాల్పులకు ధీటుగా జవాబిస్తున్నాం

* త్రివిధ దళాలు ఒక్కటై దేశాన్ని కాపాడుతాయి

* మా యుద్ధం ఉగ్రవాదులతోనే అది కొనసాగుతుంది

* మన సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా పాకిస్తాన్ ఉద్రిక్తతలను మరింత పెంచుతోంది

* భారత సైన్యం అప్రమత్తంగ ఉండటం వల్ల పాక్ కుట్రలు ఫలించలేదు

* అమ్రామ్ మిస్సైల్ రాజౌరీ సెక్టార్‌లో దొరికింది