Asianet News TeluguAsianet News Telugu

జాన్సన్ అండ్ జాన్సన్ కరోనా వ్యాక్సిన్ పరీక్షలు నిలిపివేత

జాన్సన్ అండ్ జాన్సన్ కూడా తన వ్యాక్సిన్ పరీక్షలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. వ్యాక్సిన్‌ ప్రయోగించిన వాలంటీర్లలో ఒకరు అస్వస్థతకు గురికావడంతో జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ ఈ నిర్ణయం తీసుకుంది.

Johnson & Johnson halts COVID-19 vaccine trial after participant falls sick
Author
Hyderabad, First Published Oct 13, 2020, 9:21 AM IST

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ మహమ్మారి కి వ్యాక్సిన్ కనుగొనేందుకు పలు దేశాలు ప్రయోగాలు చేస్తున్నాయి. ఫార్మా కంపెనీలు సైతం వ్యాక్సిన్ తయారీకి నానా తంటాలు పడుతున్నాయి. చాలా ఫార్మా కంపెనీలు కీలక దశకు చేరుకున్నాయి. మరి కొద్దిరోజుల్లో వ్యాక్సిన్ వచ్చేస్తుందని అందరూ భావించారు. అయితే.. ఆ వ్యాక్సిన్ ప్రయోగాలలో ఏదో ఒక ఆటంకం తలెత్తుతూనే ఉంది. దీంతో పరీక్షలు నిలిపివేస్తున్నారు. తాజాగా.. జాన్సన్ అండ్ జాన్సన్ కూడా తన వ్యాక్సిన్ పరీక్షలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. వ్యాక్సిన్‌ ప్రయోగించిన వాలంటీర్లలో ఒకరు అస్వస్థతకు గురికావడంతో జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ ఈ నిర్ణయం తీసుకుంది.

తాము నిర్వహించిన అథ్యయన పరీక్షలో పాల్గొన్న ఓ వ్యక్తి వివరించలేని అస్వస్థతకు లోనవడంతో తమ కోవిడ్‌-19 వ్యాక్సిన్‌పై మూడవ దశ పరీక్షలు సహా అన్ని క్లినికల్‌ ట్రయల్స్‌ను తాత్కాలికంగా నిలిపివేశామని కంపెనీ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. దీంతో 60,000 మందిని క్లినికల్‌ ట్రయల్స్‌ కోసం ఏర్పాటు చేసిన ఆన్‌లైన్‌ ఎన్‌రోల్‌మెంట్‌ వ్యవస్థను మూసివేశారు. మరోవైపు రోగుల భద్రతా కమిటి భేటీ సమావేశమై పరిస్థితిని సమీక్షించింది.

ఏ క్లినికల్‌ ట్రయల్స్‌లో అయినా ముఖ్యంగా భారీ అథ్యయనాల్లో తీవ్ర ప్రతికూల ఘటన(ఎస్‌ఏఈ)లు ఊహించదగినవేనని జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ పేర్కొంది. అథ్యయనాన్ని నిలిపివేసి ఎస్‌ఏఈకి కారణం ఏమిటనేది పరిశీలించి వ్యాక్సిన్‌ మానవ పరీక్షలను పునరుద్ధరిస్తామని తెలిపింది. అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా 200 కేంద్రాల్లో 60,000 మంది వాలంటీర్లపై భారీగా మూడవ దశ క్లినికల్‌ ట్రయల్స్‌ చేపట్టేందుకు సెప్టెంబర్‌లో జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వాలంటీర్ల రిక్రూట్‌మెంట్‌ను ప్రారంభించింది. అమెరికాతో పాటు అర్జెంటీనా, బ్రెజిల్‌, చిలీ, కొలంబియా, మెక్సికో, పెరూ, దక్షిణాఫ్రికాలో క్లినకల్‌ ట్రయల్స్‌ను కంపెనీ నిర్వహిస్తోంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios