Amritpal's aide Joga Singh: అమృత్ పాల్ సింగ్ పిలిభిత్ లో తలదాచుకోవడానికి సహకరించిన ఆయన అనుచరుడు జోగా సింగ్ ను సోలీసులు అరెస్టు చేశారు. అమృత్ పాల్ సింగ్ తో నేరుగా సంబంధాలు కలిగివుంటూ అతనికి ఆశ్రయం ఇవ్వడంతో పాటు వాహనాలు ఏర్పాటు చేసిన జోగా సింగ్ ను అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు.
Amritpal Singh's aide Joga Singh arrest: ఖలిస్తాన్ అనుకూల నాయకుడు, వారిస్ డీ పంజాబ్ (Waris De Punjab) చీఫ్ అమృత్ పాల్ సింగ్ ముఖ్య అనుచరుడితో పాటు ముగ్గురు అరెస్టు అయ్యారు. అమృత్ పాల్ సింగ్ పిలిభిత్ లో తలదాచుకోవడానికి సహకరించిన ఆయన అనుచరుడు జోగా సింగ్ ను సోలీసులు అరెస్టు చేశారు. అమృత్ పాల్ సింగ్ తో నేరుగా సంబంధాలు కలిగివుంటూ అతనికి ఆశ్రయం ఇవ్వడంతో పాటు వాహనాలు ఏర్పాటు చేసిన జోగా సింగ్ ను అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. సిర్హింద్ లో వారిని అరెస్టు చేసినట్లు చెప్పారు. అమృత్ సర్-రూరల్, హోషియార్పూర్ పోలీసుల సంయుక్త ఆపరేషన్ లో జోగాసింగ్ ను అరెస్టు చేసినట్లు బోర్డర్ రేంజ్ డీఐజీ నరీందర్ భార్గవ్ తెలిపారు. మార్చి 18 నుంచి 28 వరకు జోగా సింగ్ అమృత్ పాల్ వద్ద ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
అమృత్ పాల్ ను మార్చి 27న పంజాబ్ కు తీసుకొచ్చింది జోగాసింగ్ అని అమృత్ సర్ గ్రామీణ ఎస్ఎస్పీ సతీందర్ సింగ్ తెలిపారు. లుధియానాకు చెందిన జోగా ఉత్తరప్రదేశ్ లోని ఫిలిభిత్ లోని డేరాకు ఇన్ చార్జ్ గా వ్యవహరించాడు. అమృత్ పాల్ సింగ్ తో జోగా సింగ్ కు ప్రత్యక్ష సంబంధం ఉంది. అమృత్ పాల్ సింగ్ కు ఆశ్రయం కల్పించడంతో పాటు వాహనాలు ఏర్పాటు చేశాడు. పిలిభిత్ లో ఉండి, ఆ తర్వాత పంజాబ్ కు తిరిగి వచ్చేలా ఏర్పాట్లు చేశాడని భార్గవ్ మీడియా సమావేశంలో చెప్పారు. అమృత్ పాల్ సింగ్, అతని 'వారిస్ పంజాబ్ దే' సంస్థ సభ్యులపై పోలీసులు గత నెలలో పెద్ద ఎత్తున దాడులు ప్రారంభించారు. రాడికల్ సిక్కు మతబోధకుడు మార్చి 18న పోలీసుల ఉచ్చు నుంచి తప్పించుకుని, వాహనాలు మార్చి తన రూపాన్ని మార్చుకుని తిరుగుతున్నాడు.
అమృత్ పాల్ సింగ్ కు ఆశ్రయం కల్పిస్తున్న ఇద్దరు వ్యక్తులను శుక్రవారం అరెస్టు చేశారు. అరెస్టయిన వారిని హోషియార్ పూర్ జిల్లా బాబక్ గ్రామానికి చెందిన రాజ్ దీప్ సింగ్, జలంధర్ జిల్లాకు చెందిన సరబ్ జిత్ సింగ్ గా పోలీసులు గుర్తించారు. రాజ్ దీప్ సింగ్, సరబ్ జిత్ సింగ్ లను శుక్రవారం రాత్రి డ్యూటీ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి ఒక రోజు పోలీసు రిమాండ్ కు తరలించారు. అమృత్ పాల్ సింగ్ ప్రధాన అనుచరుడు పాపల్ ప్రీత్ సింగ్ ను అమృత్ సర్ రూరల్ పోలీసులు కతు నంగల్ ప్రాంతంలో అరెస్టు చేశారు. జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టు చేశామనీ, అమృత్ పాల్ అనుచరుడుగానే కాకుండా ఆరు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని సంబంధిత వర్గాలు తెలిపాయి.
