Asianet News TeluguAsianet News Telugu

నిరుద్యోగ భృతి పెంపు.. నెలకు రూ.3,500

నిరుద్యోగులకు రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. తమ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్న యువతకు నిరుద్యోగ భృతి పెంచుతున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రకటించారు.

Jobless in Rajasthan to get RS 3,500 a month dole from june on words
Author
Hyderabad, First Published Jun 19, 2019, 11:17 AM IST

నిరుద్యోగులకు రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. తమ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్న యువతకు నిరుద్యోగ భృతి పెంచుతున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రకటించారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్న నిరుద్యోగ యువతకు నెలకు 3,500 అందించాలని రాజస్థాన్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సంవత్సరం ఫిబ్రవరి మొదలుకుని ఈ నగదు సాయాన్ని అందించాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ‘ముఖ్యమంత్రి యువ సంబల్ యోజన’ కింద ఈ సాయం అందనుంది. ఈ సాయం పొందాలంటే డిగ్రీ పూర్తి చేసి రాజస్థాన్‌కు చెందిన యవతై ఉండాలి.
 
ఈ స్కీం కింద అర్హులైన యువకులకు నెలకు 3,000 రూపాయలు, యువతులకు, దివ్యాంగులకు 3,500 రూపాయల నిరుద్యోగ భృతి అందించాలని రాజస్థాన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నగదు మొత్తం రెండు సంవత్సరాల వరకూ గానీ లేక వారికి ఉద్యోగం వచ్చేంత వరకూ గానీ అందించే అవకాశం ఉంది. ఈ నిరుద్యోగ భృతికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడటంతో ఉద్యోగాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాజస్థాన్ యువతకు కొంత ఊరట లభించినట్లయింది.

Follow Us:
Download App:
  • android
  • ios