Asianet News TeluguAsianet News Telugu

ఇలాంటి స్కామ్ కూడా ఉంటుందా? కడుపు చేసే ఉద్యోగం ఇస్తామని బోల్తా

బిహార్‌లో ఓ విచిత్ర స్కామ్ బయటపడింది. కడుపు చేసే ఉద్యోగం ఉన్నదని అమాయక యువకులను బోల్తా కొట్టిస్తున్న ఓ భారీ సైబర్ సిండికేట్‌ను పోలీసులు పట్టుకోగలిగారు. ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
 

job scam offering money to impregnate women who are wainting for pregnancy busted in bihar kms
Author
First Published Dec 31, 2023, 8:27 PM IST

Job Scam: స్కాముల్లో ఈ స్కాము తీరే వేరయా.. అమాయక యువకులను వలలో వేసుకుని డబ్బు గుంజడానికి ఏకంగా కడుపు చేయడం ఒక ఉపాధి అని, అదొక జాబ్ అని చెప్పడమే కాక.. అలా చేస్తే డబ్బులూ వస్తాయని చెప్పి నమ్మించిన ఘనులు వారు. దానికి ప్రత్యేకంగా ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ అనే పేరూ పెట్టారు. అందులో చేరడానికి రిజిస్ట్రేషన్ డబ్బులు కూడా చెల్లించాలని వల వేశారు. ఆ తర్వాత సెక్యూరిటీ డిపాజిట్‌ కోసం రూ. 5,000 నుంచి రూ. 20,000 చేయాలని కూడా చెప్పి డబ్బులు దండుకుంటున్నారు. ఈ స్కామ్ బిహార్‌లో బయటపడింది.

ఈ వ్యవహారమంతా సోషల్ మీడియా వేదికగా జరిగింది. బిహార్‌లోని నవాడాలో ఈ స్కామ్‌లో 8 మంది అరెస్టు అయ్యారు. సంతానం లేని మహిళలు గర్భం దాల్చడానికి ఇబ్బంది పడుతున్నారని, అలాంటి వారికి కడుపు చేస్తే డబ్బులు అందిస్తామనే ఫ్రాడ్ స్కీమే ఇది. ఈ గ్రూప్‌కు ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ అని పేరు పెట్టుకున్నారు. సోషల్ మీడియా వేదికగా వీరు.. మహిళలను కడుపు చేస్తే డబ్బులు ఇస్తామని మోసం చేస్తున్నారు. 

ఇందులో రిజిస్టర్ చేసుకోవడానికి రూ. 799 ఫీజు చెల్లించాలని, ఆ తర్వాత అదనంగా రూ. 5,000 నుంచి రూ. 20,000 వరకు సెక్యూరిటీ మనీ పెట్టాలని డిమాండ్ చేసి వసూలు చేశారని పోలీసులు తెలిపారు. 

Also Read: TDP: ఏపీలో తెలంగాణ ట్రెండ్.. చంద్రబాబు, పవన్ రెండు స్థానాల్లో పోటీ? అల్లుడి కోసం సీటు త్యాగం!

ఈ స్కామ్ దర్యాప్తు చేయడానికి ప్రత్యేక పోలీసు బృందం ఏర్పడింది. ఈ బృందం స్కామ్ మాస్టర్ మైండ్‌గా భావిస్తున్న మున్నా కుమార్‌ నివాసంలో తనిఖీలు చేయడంతో మరో ఏడుగురు వివరాలు తెలియవచ్చాయి. ఆ తర్వాత ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే, చాలా మంది ఇతర నిందితులు పోలీసుల నిఘా నుంచి తప్పించుకోగలిగారని తెలిసింది.

దేశవ్యాప్తంగా ఉన్న అతిపెద్ద సైబర్ సిండికేట్‌లో వీరు ఒక భాగం మత్రమేనని డీఎస్పీ కళ్యాణ్ ఆనంద్ స్పష్టం చేశారు. నిందితులను అరెస్టు చేసే సమయంలో తొమ్మిది స్మార్ట్‌ఫోన్‌లు, ఒక ప్రింటిర్‌ను సీజ్ చేశారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతున్నదని, మరింత మంది నిందితులను అరెస్టు చేస్తామని ఓ సీనియర్ పోలీసు అధికారి వివరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios