JNU Vice Chancellor Santishree Pandit:  జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) యూనివర్సిటీ క్యాంపస్‌లో విద్యార్థులు రాజకీయాలు చేయడంపై వీసీ శాంతిశ్రీ ధూళిపూడి పండిట్ ఘాటైన వ్యాఖ్య చేశారు, క్యాంపస్‌లో హింసకు తావు లేదని, రాజకీయ ఆకాంక్షలు ఉన్న విద్యార్థులు  యూనివర్సిటీకి.. బయట తమ ఆకాంక్షలను నెరవేర్చాలని అన్నారు. 

JNU Vice Chancellor Santishree Pandit:  జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU) యూనివర్సిటీ క్యాంపస్‌లో విద్యార్థులు రాజకీయాలు చేయడంపై వీసీ శాంతిశ్రీ ధూళిపూడి పండిట్ ఘాటైన వ్యాఖ్య చేశారు. JNU.. రాజకీయ ఆకాంక్షలను నేర‌వేర్చుకునే స్థలం కాదని జెఎన్‌యు వైస్ ఛాన్సలర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. జేఎన్‌యూ క్యాంపస్‌లో హింసకు తావు లేదని, రాజకీయ ఆకాంక్షలు ఉన్న విద్యార్థులు యూనివర్సిటీకి.. బయట తమ ఆకాంక్షలను నెరవేర్చాలని అన్నారు. క్యాంపస్‌లో రాజకీయాలు చేసిన వారందరూ జైలులో ఉన్నారని వైస్‌ఛాన్సలర్‌ అన్నారు. 

JNU లో 90 శాతం మంది విద్యార్థులు రాజకీయాలకు అతీతంగా ఉన్నారని, కేవలం 10 శాతం మంది మాత్రమే తమ రాజకీయ జీవితాన్ని వర్సిటీలో నిర్మించుకోగలమని భావిస్తున్నార‌నీ, ఆ విద్యార్థులు మాత్ర‌మే .. ఇత‌రులను ఇబ్బందుల‌కు గురి చేస్తున్నార‌ని JNU Vice Chancellor అన్నారు.

ఇటీవలి కాలంలో JNU లో ఘర్షణల గురించి ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఇది రాజకీయంగా క్రియాశీల క్యాంపస్ అని, అయితే విశ్వవిద్యాలయం హింసకు స్థలం కాదని, రాజకీయ నాయకులు కావాలనుకునే వారు బయటికి వెళ్లి ఎన్నికల్లో పోరాడాలని అన్నారు. 90 % మంది విద్యార్థులు అరాజకీయపరులు.. కేవలం 10 శాతం మంది మాత్రమే ఇబ్బందులకు గురిచేస్తున్నారని, తమ రాజకీయ జీవితాన్ని జేఎన్‌యూలో నిర్మించుకోవచ్చని భావిస్తున్నారని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జెఎన్‌యు రాజకీయ జీవితానికి స్మశానవాటిక. చివరిసారి ఏమి జరిగిందో త‌న‌కు తెలుసు అని, అలాంటి రాజకీయాలు చేసిన వారందరూ జైలులో ఉన్నారని JNU Vice Chancellor అన్నారు.

"మీరు మీ సమయాన్ని ఎందుకు వృధా చేస్తున్నారు? మీరు రాజకీయ నాయకుడు కావాలనుకుంటే బయటికి వెళ్లి ఎన్నికలలో పోరాడండి. మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు? భారతదేశం స్వేచ్ఛా దేశం. మీరు ఇక్కడకు చదువుకోవడానికి వచ్చారు, నేర్చుకోవడానికి వచ్చారు. మీరందరూ అణగారిన కుటుంబాల నుంచి ఇక్కడి వచ్చారు. మీరు మంచి ఉద్యోగం సంపాదించి బయటకు వెళ్లాలని, మీ కుటుంబం మీపై ఆధారపడి ఉంది" అని వీసీ తెలిపారు.

షార్జీల్ ఇమామ్, ఉమర్ ఖలీద్, నటాషా నర్వాల్, దేవాంగనా కలితతో సహా పలువురు JNU విద్యార్థులు, పూర్వ విద్యార్ధులు 2020 ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో వారి ప్రమేయం ఉన్నందున కఠినమైన చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA) కింద అరెస్టు చేయబడ్డారు. నటాషా నర్వాల్ మరియు దేవాంగనా కలిత తర్వాత బెయిల్‌పై విడుదల కాగా, ఉమర్ ఖలీద్ మరియు షార్జీల్ ఇమామ్ ఇంకా జైలులో ఉన్నారు.

ఆ స‌మ‌యంలో JNUలో చదువుతున్న కన్హయ్య కుమార్, ఖలీద్‌లను 2016లో క్యాంపస్ నిరసనపై దేశద్రోహం కేసులో ప్రమేయం ఉన్నందున ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారిని బెయిల్‌పై విడుదల చేశారు. క‌న్న‌య్య‌ కుమార్ ప్ర‌స్తుతం కాంగ్రెస్ పార్టీలో క్రియ‌శీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఇటీవలి కాలంలో.. జేఎన్ యూలో వామపక్ష అనుబంధ విద్యార్థి సంఘాలు, RSS విద్యార్థి సంఘం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP)కి సంబంధించిన అనేక హింసాత్మక సంఘటనలు వెలుగులోకి వ‌చ్చాయి.

ఈ ఏడాది ఏప్రిల్‌లో.. వర్సిటీలోని కావేరీ హాస్టల్‌లో రామనవమి రోజున మాంసాహారం వ‌డ్డించార‌ని రెండు గ్రూపుల విద్యార్థులు ఘర్షణకు దిగారు. అలాగే.. జ‌నవరి 5, 2020న.. కొంత‌మంది దుండ‌గులు ముసుగులు ధరించి.. క్యాంపస్‌లోకి చొరబడి.. హాస్టళ్లలోని విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని, కర్రలు, రాళ్లు, ఇనుప రాడ్‌లతో అల్లకల్లోలం చేశారు. కిటికీలు, ఫర్నిచర్, వ్యక్తిగత వస్తువులను పగలగొట్టారు.

దాదాపు రెండు గంటల పాటు క్యాంపస్‌లో గందరగోళం నెలకొంది. JNU స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షురాలు ఐషే ఘోష్ తో సహా కనీసం 28 మంది గాయపడ్డారు. ఈ త‌రుణంలో రాజకీయాలు చేయాలని, చర్చలు జరపాలని, హింసను ఆశ్రయించవద్దని పండిట్ కోరారు.

క్రియాశీల రాజకీయాలు చేయండి, డిబేట్లు పెట్టుకోండి, మాట్లాడుకోండి కానీ ఒకరినొకరు కొట్టుకోవద్దు. ఇంతకుముందు ఇలాంటి నిరసనలు లేవు. కానీ ఇప్పుడు అవి ఘర్షణలకు దారితీస్తున్నాయి. ఎందుకంటే రెండు గ్రూపులు సమానంగా బలంగా ఉన్నాయి ”అని ఆమె అన్నారు.

"రెండు గ్రూపుల నాయకులు తాము భారతదేశానికి ప్రధానమంత్రులు కాగలమని అనుకుంటున్నారు. ప్రధానమంత్రి ప్రచారక్ జెఎన్‌యు విద్యార్థి కాదు. ఆశయాలు మంచివి కానీ జెఎన్‌యు హింసకు స్థలం కాదు. జెఎన్‌యు ఒక పరిశోధనా విశ్వవిద్యాలయం. మీరు చేయమని నేను చెప్పడం లేదు. డిబేట్ కాదు.. డిబేట్ చేసుకోండి, డిస్కస్ చేసుకోండి కానీ ఒకరినొకరు కొట్టుకోకండి” అని ఆమె స్ప‌ష్టం చేశారు.